బాలయ్యకు నచ్చిన కథతో త్రివిక్రమ్ – బన్నీ మూవీ.. బడ్జెట్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది.. !

టాలీవుడ్ ఇండస్ట్రీలో బన్నీ – త్రివిక్రమ్ కాంబో ఓ మ్యాజిక్ కాంబో. వీరిద్దరి కాంబోలో తెర‌కెక్కిన‌ సినిమాలన్నీ టాలీవుడ్ లో మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పటివరకు బన్నీ – త్రివిక్రమ్ క‌లిసి మూడు సినిమాలను చేశారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠ‌పురంలో ఈ మూడు సినిమాలు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా వీరిద్దరి కాంబోకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారుతుంది. బాలయ్యకు ఎంతగానో నచ్చిన ఓ కథతో.. బన్నీ, త్రివిక్రమ్ నాలుగో సినిమా రూపొందనుందని వార్తలు వైరల్ అవుతున్నాయి.

Balakrishna keeps mum on Akhanda's release | Telugu Cinema

ఇక నందమూరి నట‌సింహం బాలకృష్ణ.. గతంలోనే ఓ సందర్భంగా ఛాంగిస్ ఖాన్ జీవిత చరిత్ర ఆధారంగా తెర‌కెక్కనున్న సినిమాలో హీరోగా నటిస్తానంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అదే కథను బన్నీ హీరోగా త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించ‌నున్నాడ‌ట‌. వీరిద్దరి కాంబోలో రూపొందుతున్న ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ.700 కోట్లు ఉంటుందని టాక్ . మొదట మైథాలజికల్ కాన్సెప్ట్‌తో సినిమా రూపొందుతుందని వార్తలు వినిపించిన.. ఇప్పుడు దానికి భిన్నంగా కథ తరికెక్కుతుండడం హాట్ టాపిక్ గా మారింది. ఇక బన్నీతో త్రివిక్రమ్ తెరకెక్కించబోయే ఈ సినిమా ఆయ‌న కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్ ఇండియన్ మూవీ కావడంతో.. ఈ సినిమాతో ఎలాగైనా సరికొత్త రికార్డు క్రియేట్ చేయాలని ప్లానింగ్ లో ఉన్నాడట త్రివిక్రమ్.

Allu Arjun-Trivikram: The Iconic Duo Returns

ఛాంగిస్ ఖాన్ జీవిత చరిత్రతో భారీ సినిమా రూపొందించడానికి.. అవసరమైన క‌థ‌, కథనాలను కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక బన్నీ గతంలో రుద్రమదేవి ప్రాజెక్టులో ప్రధాన పాత్రలో నటించి భారీ సక్సెస్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే బన్నీ – త్రివిక్రమ్ కాంబోలో నాలుగో సారి కూడా రూపొంద‌నున్న ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీ.. బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్ స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్నారని.. సినిమాతో ప్రేక్షకులను సరికొత్త ప్రపంచానికి తీసుకెళ్లనొన్నట్లు టాక్. ఇక ఈ సినిమాను.. హారిక అండ్ హాసిని బ్యానర్‌లో తెర‌కెక్కించనున్నారు.