ప్రస్తుతం కోలీవుడ్‌లో ధనుష్ వర్సెస్ నయనతార వార్ హాట్ టాపిక్ గా మారింది. తన పెళ్లి డాక్యుమెంటరీ నానం రౌడీ దానన్‌లో మూడు సెకండ్ల ఫుటేజ్ వాడినందుకు తమపై ధనుష్ పగ తీర్చుకుంటున్నాడని.. ఒక్క చిన్న క్లిప్పు వాడినందుకు రూ.10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేయడం సరికాదంటూ.. నీతులు చెప్పే నువ్వు అవి పాటించవు.. నీ క్యారెక్టర్ ఏంటో నీ అభిమానులతో పాటు ప్రపంచానికి ఇప్పుడు తెలుస్తుంది అంటూ సంచల కామెంట్ చేసింది. ఏకంగా మూడు పేజీల లేఖను రాస్తూ ధనుష్ పై దుమ్మెత్తి పోసింది నయన్. దీంతో నయన్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఇష్యూ పై నయనతారకు సపోర్ట్ గా ఎంతో మంది స్టార్ హీరోయిన్స్.. అలాగే ధనుష్ కు ఎంతో మంది ప్రముఖ దర్శక, నిర్మాతలు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, కమ్ డైరెక్టర్‌గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఎస్.ఎస్.కుమార్.. ఓ బహిరంగలేఖను రిలీజ్ చేశాడు.
ఇందులో ధనుష్ పైన నయన్ చేసిన కామెంట్లను ఖండించడమే కాదు.. ఆమె భర్త విఘ్నేష్ శివన్‌పై కూడా ఫైర్ అయ్యాడు. తన అనుమతి లేకుండా తన సినిమాలోని మూడు సెకండ్లు ఫుటేజ్ వాడినందుకు.. ధనుష్ మీపై నోటీసులు జారీ చేయడం తప్పు పడుతున్నారు. మరి మీ భర్త చేసింది ఏమిటి అంటూ ప్రశ్నించాడు. నేను రిజిస్టర్ చేయించుకున్న టైటిల్ అని తెలిసి కూడా మీ భర్త ఎల్ఐసి టైటిల్ ని తన కోసం వాడుకున్నాడు. ఆ టైటిల్ కోసం అతను నన్ను నేరుగా కాకుండా వేరొకరిని పంపి ఆరతిసాడు. అది నా స్టోరీ కోసం నేను పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని పెట్టుకున్న టైటిల్ అని సున్నితంగా తిరస్కరించినా.. అనుమతి అయినా లేకుండా రిజిస్టర్ చేయించుకున్న టైటిల్‌ని నీ భర్త సినిమాకు వాడుకున్నాడు. దీన్నెలా నువ్వు సమర్థిస్తావు. ఈ ఫుటేజ్ ని ఉపయోగించడానికి మీకంటే శక్తివంతమైన వ్యక్తి నుండి అనుమతి కోసం మీరు రెండేళ్లు ఓపికగా చూశారు.
అయితే నేను ఒక చిన్న నిర్మాతను కనుక నన్ను మీరు తొక్కేసి మీకోసం నా టైటిల్ ఉపయోగించుకున్నారు. అది నిజంగా నన్ను కలిసివేస్తుంది. మీరు దానికి సమాధానం చెప్పాలి. మీ వల్ల నేను చాలా మానసికక్షోభను అనుభవించా. అది నాపై కూడా ప్రభావం చూపించిందంటూ వెల్లడించాడు. ప్రతినిర్మాత తన సినిమాల కోసం సమయాన్ని, డబ్బును వేచిస్తాడు కానీ మీరు మీ వ్యాపార ప్రయోజనాల కోసం ఏదైనా ఉపయోగించాలి అనుకుంటే చట్టబద్ధంగా సరైన అనుమతి తీసుకోకుండా.. చేసేయొచ్చా. మీరేమైనా ఉచితంగా నటిస్తున్నారా.. మీరు మాత్రం మా ఫోటోజి టైటిల్స్ ని ఉపయోగించటానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. అది తప్పని మీపై లేదా మీ భర్త పై ఏదైనా నోటీసు వస్తే మాత్రం దానిని తీసుకోలేరు. మీరు, మీ భర్త అవి భయంకర ట్రెండ్‌ను పరిశ్రమలో సెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ బహిరంగ లేఖ రాశాడు. డైరెక్టర్ ఎస్.ఎస్.కుమార్ రాసిన బహిరంగ లేక నెట్టింట వైరల్ గా మారుతుంది.