చరణ్ మొదటి సారి అయ్యప్ప మాల వేసినప్పుడు చిరు చేసిన కామెంట్స్ ఏంటో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో కూడా చాలా మంది స్టార్ సెలబ్రిటీస్ ఎప్పటికప్పుడు అయ్యప్ప మాలలో కనిపిస్తూనే ఉంటారు. అందులో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా ఎక్కువగా మాల వేసుకుని ప్రేక్షకులకు క‌న‌పడుతుంటాడు. రామ్ చరణ్ ఆల్మోస్ట్ రెగ్యులర్గా ప్రతి ఏడాది అయ్యప్ప మాల ధరిస్తారు. అయితే తాజాగా రైటర్ పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఓ వీడియోలో రామ్ చరణ్ అయ్యప్ప స్వామి మాల గురించి వివరించాడు. చ‌ర‌ణ్‌ అయ్యప్ప మాల మొదటిసారి వేసినప్పటికీ సంగతి మాట్లాడుతూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ షేర్ చేసుకున్నాడు. గోపాలకృష్ణ మాట్లాడుతూ 2002లో మేము అయ్యప్ప దీక్ష తీసుకుని వెళ్తుండగా చిరంజీవి గారు మమ్మల్ని పిలిచి చరణ్ బాబుని చూపించాడు. తను కూడా మాల వేసుకున్నాడు.

Ram Charan Teja in Ayyappa Mala Dress HD Gallery, Images | Page 2

మొదటిసారి కన్నెస్వామి.. ఈ స్వామిని మీకు అప్పచెబుతున్నాను. జాగ్రత్తగా తీసుకువెళ్లి తీసుకొనిరండి అని అన్నారని. హైదరాబాద్ నుంచి వరంగల్ కార్‌లో వెళ్లి.. వరంగల్ నుంచి ట్రైన్ లో చెంగనూరు.. తర్వాత శబరిమల దర్శనం చేసుకుని తిరిగి రావాల్సి ఉందంటూ వివరించాడు. ఇక చిరంజీవి గారు చరణ్ ని మాకు అప్పచెప్పుతూ జాగ్రత్త చిరంజీవి గారి అబ్బాయి అని ఎవరికి తెలియకుండా తీసుకువెళ్లమన్నారని వివరించారు. ఇక చరణ్తో మాకు అప్పుడే మొదటి పరిచయమని శబరిమల వెళ్లి వచ్చేలోపు ఒక నాలుగు మాటలు మాట్లాడాడు అంతే అంటూ వివరించాడు. మేము ఏది అడిగినా చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకునేవాడని.. మాకు భోజనాలు తెచ్చి ఇచ్చేవాళ్ళు. కొన్ని ఊర్లలో ట్రైన్ ఆగేది అప్పుడు చరణ్ కిటికీలోనుంచి బయటకు చూసేవారు.

వామ్మో చిరంజీవి గారి కొడుకుని ఎవరన్నా గుర్తుపడతారేమో.. అని మాకు కాస్త భయం వేసేది. ఇక శబరి వెళ్లి కొండ ఎక్కేముందు కూడా.. ఎక్కగలవా అని మేము అడిగితే ఒక సింపుల్ నవ్వు నవ్వేశారు. అయ్యప్ప మాల లో ఒక కన్నస్వామిగా పరిచయమై.. మాతో ఒకరిగా అయ్యప్పలతో కలిసి వచ్చిన జ్ఞాపకాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ పరుచూరి షేర్ చేసుకున్నాడు. మెగాస్టార్ కొడుకు అని కూడా లేకుండా ఎంతో సింపుల్గా అందరితో నవ్వుతూ ఉండేవాడని వెల్లడించాడు. దీంతో ప్రస్తుతం పరుచూరి చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారాయి. ఇక అప్పటినుంచి ఇప్పటికీ చరణ్ దాదాపు ప్రతి ఏడాది మాల వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా రామ్ చరణ్ అయ్యప్ప మాల లోనే ఉన్నారు. ఇటీవల గేమ్ ఛేంజ‌ర్‌ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కూడా చరణ్ అయ్యప్ప మాల తోనే కనిపించి ప్రేక్షకులను ఆకర్షించారు.