టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తండ్రి జోసఫ్ ప్రభు కన్నుమూశారు. ఈ విషయాన్ని సమంత తాజాగా తన ఇన్స్టా వేదికగా షేర్ చేసుకుంది సమంత. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తన సోషల్ మీడియా వేదికగా నాన్నని ఇక కలవలేను అంటూ హార్డ్ బ్రేకింగ్ ఇమోజీని షేర్ చేసుకుంది. కొద్దిసేపటి క్రింద సమంత చేసిన ఈ పోస్ట్ నెటింట వైరల్ గా మారడంతో.. సిని ప్రముఖులతో పాటు సమంత అభిమానులు కూడా ఆమెకు సానుభూతి తెలియజేస్తున్నారు.
ఇక సమంతకు మొదటి నుంచి తండ్రి అంటే ఎంతో ప్రాణం. తన తండ్రి తన కర్రీలో ముఖ్యపాత్ర పోషించారని ఎన్నోసార్లు శ్యామ్ గతంలో వెల్లడించింది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నా తన తల్లిదండ్రులకు ఎప్పుడు ప్రత్యేక సమయం ఇస్తూ ఉండేది. సినీ ఇండస్ట్రీలో తనకు ప్రతిక్షణం అండగా తన తండ్రి నిలిచారని.. మద్దతుగా ఉన్నాడని ఆమె ఎన్నోసార్లు ఎమోషనల్ అయింది. ఇలాంటి క్రమంలో ఆమె ఎంతగానో ప్రేమించిన తన తండ్రి ఆమెకు దూరమవడంతో సమంత హాట్ బ్రేక్ అయింది.
అయితే కార్డియాక్ అరెస్టు జోస ప్రభు నిన్న రాత్రి నిద్రలోనే కన్నుమూసినట్లు తెలుస్తోంది. ఇక సమంత టాలీవుడ్ లో ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నార్త్ లోనే కాదు.. బాలీవుడ్ లోనూ, హాలీవుడ్ లోనూ తన సత్తా చాటుతున్న ఈ అమ్మడు.. అంచల అంచెలుగా ఎదుగుతూ సక్సెస్ సాధిస్తుంది. తన సినీ కెరీర్‌లో ఎలాంటి సక్సెస్ అందుకున్న పర్సనల్ లైఫ్ లో మాత్రమే ఎప్పటికప్పుడు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న సమంతకు.. మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. తను ఎంతగానో ప్రేమించే తన తండ్రి మృతి చెందడంతో సమంత కన్నీటి పర్యంతమవుతున్నారు.