ఆదిత్య 369 హీరోయిన్.. మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలు అవుతుందా.. ఈ మ్యాటర్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

నంద‌మూరి న‌ట‌ సింహం బాలకృష్ణ కెరీర్‌లోనే ఆల్ టైం క్లాసికల్ హిట్‌గా నిలిచిన‌ వాటిలో మొదటిది ఆదిత్య 369. ప్రముఖ డైరెక్టర్ సంగీతం శ్రీనివాస్ తెర‌కెక్కించిన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం. టైం ట్రావెల్ కాన్సెప్ట్ పొందిన ఈ సినిమా.. ఇప్పటికీ టీవీలో టెలికాస్ట్ అవుతుందంటే ప్రేక్షకులు స్క్రీన్ లకి అతుక్కుపోయి మరి సినిమా చూస్తూ ఉంటారు. అలాంటి రిపీట్ వాల్యూ ఉన్న అద్భుతమైన సినిమా ఆదిత్య 369. ఇక ఈ సినిమా రిలీజై బ్లాక్ బ‌స్టర్ కొట్టిన చాలా కాలం వరకు కూడా మరోసారి ఇలాంటి కాన్సెప్ట్ సినిమా తీయడానికి ఎవరు సాహసించలేదంటే అది ఎంత అద్భుతమైన సినిమాను అర్థం చేసుకోవచ్చు.

29YearsOfAditya369: Balakrishna's unseen working stills from the film |  Telugu Movie News - Times of India

ఇటీవల కాలంలో మరోసారి ట్రైమ్‌ ట్రావెల్ సినిమాలు తెర‌కెక్కుతున్నాయి. కాగా ఆదిత్య 369 లో బాలయ్య మోడరన్ పాత్రలో అలాగే శ్రీకృష్ణదేవరాలలో పాత్రలో ప్రేక్షకులను కట్టిపడేశాడు. ఇక ఈ సినిమాలో ప్రముఖ హీరో, హీరోయిన్.. త‌రుణ్‌, రాసి చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా నటించారు. సినిమాలో వారి నటనకు కూడా మంచి ఇమేజ్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన మోహిని అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే తాజాగా.. ఆమె మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలు అవుతుందంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అదెలా సాధ్యం.. వాళ్ళిద్దరి మధ్యన ఉన్న రిలేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. మోహిని.. ఆదిత్య 369 తర్వాత కేవలం రెండు తెలుగు సినిమాల్లో మాత్రమే నటించింది.

వాటిలో ఒకటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన హిట్లర్. ఇందులో చిరంజీవికి పెద్ద చెల్లెలు పాత్రలు కనిపించింది. రాజేంద్ర ప్రసాద్‌ను ప్రేమించి చిరుని ఎదిరించి వివాహం చేసుకొని అతనికి శత్రువుగా మారే పాత్రలో ఏమే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో పాత్రతోను టాలీవుడ్ ఆడియన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోయే ఇమేజ్‌ క్రియేట్ చేసుకుంది మోహిని. అలా.. ఆదిత్య 369 హీరోయిన్.. చిరంజీవికి చెల్లి అయింది. ఇక తెలుగులో మొహిని నటించింది మూడు సినిమాలే అయినా.. తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. బాలనటిగా కెరీర్‌ను ప్రారంభించిన ఈమె.. 1999లో శ్రీనివాస్ అనే వ్యక్తిని ప్రేమించి సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. 2004లో రీ ఎంట్రీతో 2011 వరకు సినిమాల్లో యాక్టివ్ గా ఉంది. తర్వాత పలు టీవీ సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా తన ఫ్యామిలీతో హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తుంది.