పుష్ప పాన్ ఇండియా లెవల్‌లో మోస్ట్ ఏవెంటెడ్ సినిమాగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ ప్రేక్షకుల విపరీతమైన అంచనాలను నెలకొల్పింది. ఇంకా నాలుగు రోజులే రిలీజ్ కానున్న క్రమంలో పుష్ప స్టోరీ నుంచి బ్లాక్ బస్టర్ లీక్స్ బయటకు వస్తున్నాయి. సుకుమార్ మొదటి భాగాన్ని ఏండ్ చేసిన దగ్గర నుంచి పుష్ప 2 ని ప్రారంభించనున్నాడట. పార్ట్ వన్ లో పోలీస్ అధికారి భన్వర్సింగ్ షేకావత్, పుష్ప మధ్య ఈగో క్లాష్‌తో ఎండ్ అయింది.
ఇక ఈగో సమస్యనే మరింత తీవ్రం చేసి పుష్ప 2ల్లో చూపిస్తారు అనుకుంటే పొరపాటే. పుష్ప 2లో షేకావత్ తో పాటు మరో వ్యక్తి కూడా పుష్పతో క్లాష్ ఏర్పడుతుందట. ఎర్రచందనం సిండికేట్ కి పుష్పరాజ్ సామ్రాట్ అవ్వడం.. తర్వాత మరింత ఎత్తులకు ఎదగడం.. చివరికి సీఎంతో కూడా పుష్పరాజుకి పరిచయాలు ఏర్పడడం జరుగుతుందని సమాచారం. అలాంటి సందర్భంలో ఓ పార్టీలో పుష్ప రాజ్‌తో ఫోటో దిగేందుకు సీఎం గా ఉన్న జగపతిబాబు నో చెబుతాడట.
నేను సీఎం.. వాడో స్మగ్లర్.. స్మగ్లర్‌తో సీఎం ఫోటో ఏంటి అని అవమానిస్తాడట. దీంతో పుష్ప ఈగో తీవ్రంగా హర్ట్ అవుతుందని.. ఇక్కడి నుంచి జగపతిబాబు, పుష్పల మధ్యన క్లాస్ ఏర్పడుతుందని.. జగపతిబాబు సీఎం కూర్చుని దించే వరకు పుష్ప నిద్రపోవడన్ని స్టోరీ లైన్ నెట్టింట తెగ వైరల్ గా మారుతుంది. పుష్పతో ఒక ఫోటో తీసుకుని ఉంటే సీఎం కూర్చికే ఎసరు పెట్టేవాడు కాదు కదా.. అనే డైలాగ్ కూడా సినిమాల్లో ఉందట. పోలీస్ అయినా, సీఎం అయినా.. తన ఈగోని హర్ట్ చేస్తే.. పుష్పరాజ్ సహించడు అని అర్థం వచ్చేలా సుకుమార్ పార్ట్ 2 కథను రాసినట్లు తెలుస్తుంది.