ప్రస్తుతం పాన్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ గా ఎదురు చూస్తున్న పుష్ప ప్రమోషన్స్ జోరుగా సాతాగుతున్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై.. ఇప్పటికి ఆడియన్స్‌లో కనీ..వినీ.. ఎరగని రేంజ్‌లో అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇందులో భాగంగా.. తాజాగా పుష్ప 2 మేకర్స్.. కేరళలో ప్రమోషన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగానే మల్లువుడ్ ఫ్యాన్స్‌పై తన ప్రేమను చూపాడు బన్ని. ఇందులో ఉండే ఓ మాస్ రొమాంటిక్ పాంగ్ పల్లవి లిరిక్స్ మాత్రం మలయాళం లోనే ఉంటాయని వెల్లడించాడు.
మల్లువుడ్ ఆడియన్స్‌కు తన ప్రేమ ఇలా చూపించానంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం భారీ ఎత్తున టీజర్, సాంగ్స్ అంటూ ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్లు మేకర్స్ రిలీజ్ చేస్తూనే ఉన్నారు. అలా.. తాజాగా ఫీలింగ్ అంటూ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఫుల్ సాంగ్ డిసెంబర్ 1న రిలీజ్ చేయనునట్లు కూడా వెల్లరించారు. అయితే అన్ని భాషల్లో రానున్న ఈ సాంగ్ లో వచ్చే పల్లవి లిరిక్స్ మాత్రం మలయాళం లోనే ఉండనున్నాయి. ఈ సాంగ్ లో కూడా డిఎస్పి తనదైన బిట్స్ తో తన సత్తా చాటుకున్నారు.
ఇక తాజాగా సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. సుమారు 5 కట్స్ తర్వాత.. పుష్ప 2కి యూ\ఎ సర్టిఫికెట్ లభించింది. ఏకంగా3 గం.. 20 నిమిషాల 38 సెకండ్ల నడివితో ఈ మూవీ తెరకెక్కనుంది. దీంతో బన్నీ ఫాన్స్ ఫుల్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజైన సంగతి తెలిసిందే. ఇక ఎప్పుడప్పుడు పుష్పరాజ్‌ను వెండి తెరపై చూస్తామా అంటూ అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.