సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు సరికొత్త కథలు వచ్చి ఆడియన్స్‌ను అల్లరిస్తూనే ఉంటాయి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే మారగాలలో సినిమా ఒకటిగా జనం భావిస్తుంటారు. భాషతో సంబంధం లేకుండా తర్కెక్కి.. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ప్రతి సినిమాకు ఆడియన్స్ క్యూ కడుతుంటారు. ముఖ్యంగా ఈ సినిమాల్లో హీరోలతో పట్టే.. హీరోయిన్స్ పర్ఫామెన్స్‌కు కూడా వాళ్ళు ఫిదా అవుతుంటారు. ఈ క్రమంలోనే తమ సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకున్న హీరోయిన్లు కూడా.. రెమ్యునరేషను భారీగా పెంచుతూ ఉంటారు. అలా ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటలలో ఈ పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నది కూడా ఒకటి.
ప్రస్తుతం టాప్ రెమ్యునరేషన్ ఇండియన్ యాక్టర్ అనగానే దీపిక పదుకొనే, అలియా భట్ అనుకుంటారేమో.. అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఒక్కో సినిమాకు రూ.40 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. బీహార్ సయగం. నటనపై ఇంట్రెస్ట్ మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి.. తర్వాత స్టార్ హీరోయిన్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఇంతకీ అమ్మడు ఎవరో చెప్పలేదు కదా తనే ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా. బాలీవుడ్ లో హీరోయిన్ రెమ్యునరేషన్ పెంచడంలో కీలక పాత్ర పోషించిన ఈ ముద్దుగుమ్మ.. కేవలం బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ లోను తన సత్తా చాటుకుంది. ఇక ఫోర్బ్స్ నివేదిక ప్రకారం మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా ఒక్క సినిమాకు రూ.40 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్. కేవలం హాలీవుడ్ లోనే ఈ రేంజ్ రెమ్యూనరేషన్ అందుకుంటుంది.
కానీ.. బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిస్తున్న సమయంలో ఒక్క సినిమాకు రూ.14 నుంచి రూ.20 కోట్ల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకుంది. 2002లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినయి ఈ అమ్మడు మొదట తమిళ్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయింది. తర్వాత బాలీవుడ్ గా అడుగుపెట్టి బర్ఫీ, మేరీ కోమ్, బాజీరావు మస్తానీ, దిల్ తడగ్నేదో లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఈ అమ్మడి మొదటి హాలీవుడ్ సినిమా బేవాచ్.. బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. 2017లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తర్వాత ఏ కిడ్‌లైక్ జేక్, ఇస్ నాట్ ఇట్ రొమాంటిక్ ఇలా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెస్పరైస్ చేసింది. తనకంటే చిన్నవాడైనా పాప్ సింగర్ నిక్ జోన్స్‌ను వివాహం చేసుకున్న ప్రియాంక.. ఇప్పటివరకు తన సినీ కెరీర్‌లో దాదాపు రూ.650 కోట్ల వరకు కూడా పెట్టిందట. ప్రైవేట్ జెట్, అమెరికాలో రెండు బంగ్లాలు, అలాగే ఇండియాలోనూ కొన్ని స్థిరాస్తులు, ఎన్నో లగ్జరీ కార్లు కూడా సొంతం చేసుకుంది.