ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్న వార్తల్లో నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి కూడా ఒకటి. డిసెంబర్ 4న ఈ జంట వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. తమ రిలేషన్ పై గత కొంతకాలంగా సీక్రెట్ మైంటైన్ చేసిన ఈ జంట.. ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకుని అభిమానులకు షాకింగ్ ట్రీట్ ఇచ్చారు. అప్పుడే వీరి లవ్ ఎఫైర్ గురించి అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఇదిలా ఉంటే వీళ్ళిద్దరి ప్రేమ ఎప్పటి నుంచి మొదలైంది.. లవ్ స్టోరీకి బీజం పడింది ఎక్కడ అనే అంశం ప్రతి ఒక్కరిలోనే ఆసక్తి నెలకొల్పుతూనే ఉంటుంది.
ఈ క్రమంలోనే నాగచైతన్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడితే దీనిపై క్లారిటీ ఇచ్చారు. శోభిత ధూళిపాళ్లతో తన పరిచయం.. ఆమె కుటుంబ సభ్యులతో ఏర్పడిన అనుబంధం గురించి నాగచైతన్య షేర్ చేసుకున్నాడు. ముంబైలో జరిగిన ఓటీటీ షో సందర్భంగా మొదటిసారి మేమిద్దరం కలుసుకున్నామంటూ చైతన్య వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ మా ఇద్దరి పరిచయం అనుకోకుండా జరిగిందని.. ఫస్ట్ మీటింగ్లో సరదాగా మాట్లాడుకున్నాం. కొన్ని నెలల వ్యవధిలోనే మా మధ్య బాండ్ మరింత బలపడింది.
తర్వాత ఇద్దరు ఫ్యామిలీస్ ఎన్నోసార్లు కలిసాయి అంటూ చెప్పుకొచ్చాడు. ఇక శోభిత కుటుంబ సంప్రదాయాలకు ఎంతో ప్రాధాన్యతనిస్తుందని.. తనని వారు కొడుకుల ట్రీట్ చేస్తారని నాగచైతన్య చెప్పుకొచ్చాడు. అన్నపూర్ణ స్టూడియోస్తో తమ కుటుంబానికి ఒక్క ఎమోషనల్ బాండ్ ఏర్పడిందని.. అక్కడ పెళ్లి చేసుకోవడం మాకు చాలా ప్రత్యేకంగా భావిస్తున్నాం అంటూ నాగచైతన్య చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నాగచైతన్య కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.