నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ త్వరలోనే ఉన్న సంగతి తెలిసిందే. హనుమాన్‌తో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. అయితే తాజాగా ప్రశాంత్ వర్మ.. మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. యాక్షన్ కోసం సిద్ధమా.. అని రాసుకొచ్చిన ప్రశాంత్ వర్మ.. సింబ ఇజ్ కమింగ్.. హ్యాష్ ట్యాగ్‌ను దానికి జత చేసి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెటింట తెగ వైరల్‌గా మారుతుంది.
మోక్షజ్ఞ కొత్త లుక్ సినీ ప్రియులను ఆకట్టుకుంటుంది.. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. లెజెండ్ ప్రొడక్షన్స్‌తో కలిసి.. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూసర్ గా.. బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా ఇతిహాసాల స్ఫూర్తితో రూపొందుతుందని సమాచారం. సోషియా ఫాంటసీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా బాలకృష్ణ విజన్ కి తగ్గట్టు.. లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే సినిమాగా ఉండనుందని సమాచారం.
మోక్షజ్ఞ బర్త్ డే ను సెలబ్రేట్ చేసుకుంటూ సెప్టెంబర్ 6న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక గతంలో ప్రశాంత్ వర్మ ఈ సినిమాపై మాట్లాడుతూ.. ఎన్నో అద్భుతమైన కథలు, బంగారు గని లాంటి మన ఇతిహాసాల స్ఫూర్తితో.. రూపొందునున్న ఈ సినిమా నా సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రూపొందుతుంది. మోక్షజ్ఞను పరిచయం చేయడం చాలా గొప్ప గౌరవంగా ఫీల్ అవుతున్న. అదో పెద్ద బాధ్యత అంటూ ప్రశాంత్ వర్మ వెల్లడించాడు. బాలకృష్ణ నాపైన.. నా కథ పైన ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా కోసం మోక్షజ్ఞ ఇప్పటికే యాక్షన్, ఫైట్స్, డాన్సులలో శిక్షణ తీసుకుంటున్నాడు.