ట్రెండింగ్ లో నాగార్జున నయా కార్.. కాస్ట్ తెలిస్తే మైండ్ బ్లాకే..

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే రిచెస్ట్ హీరోలలో కింగ్ నాగార్జున మొదటి వరుసలో ఉంటారు. ప్రముఖ దివంగత నటుడు.. సినీ దిగ్గజం సీనియర్ హీరో అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నాగార్జున.. టాలీవుడ్ కింగ్ గా, తండ్రికి తగ్గ తనయుడుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. వరుస సినిమాలు చేస్తూ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఓ పక్క హీరోగా రానిస్తూనే.. మరోపక్క సినిమాల్లో విలన్ గాను, బుల్లితెరపై హోస్ట్ గాను చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు. అంతేకాదు బిజినెస్ పరంగాను దూసుకుపోతున్న నాగార్జున.. తాజాగా కొడుకుల నాగచైతన్య, అఖిల్ ఎంగేజ్మెంట్ వివ‌రాల‌ను అఫీషియల్ గా ప్రకటించాడు.

ఈ క్ర‌మంలేనే అక్కినేని ఫ్యామిలీతో పాటు.. ఫ్యాన్స్‌కూడా ఫుల్ ఖుషి గా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా నాగార్జున కొన్న నయా కార్ నెటింట‌ తెగ వైరల్ గా మారుతుంది. ఈ కార్ రిజిస్ట్రేషన్ కోసం గురువారం హైదరాబాద్లోని ఖైరతాబాద్ ఆర్డిఓ ఆఫీస్ కి నాగార్జున తీసుకొచ్చారు. ఇక ఆ కారు ఎంతో ట్రెండీగా కనిపిస్తూ అందరి లుక్ ను ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే కాస్ట్‌, దాన్ని స్పెషాలిటీస్ ఏంటో అనే ఆసక్తి ఆడియ‌న్స్‌లో మొదలైంది. ఇక ఈ కార్ విషయానికి వస్తే.. ప్రముఖ కార్ల ఉత్పత్తి సంస్థ.. లెక్సస్ కంపెనీకి చెందిన ఈ కార్ ఒక ఎల్ ఎం హైబ్రిడ్ ఎలక్ట్రిక్ టాప్ మోడల్ కార్ అట.

Watch: Actor Nagarjuna buys new Lexus car, meets fans outside RTA office - India Today

ఇక దీని కాస్ట్ దాదాపు రూ.2.65 కోట్ల పైచిలుకే ఉంటుందని సమాచారం. దీన్ని స్పెషాలిటీస్ విషయానికి వస్తే.. 190 కిలోమీటర్ల వేగంతో కార్ వెళుతుందని.. కేవలం 8.7 సెకండ్లలో 0- 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలద‌ని.. వీటితో పాటే స్టైలిష్ ఇంటీరియర్, లగ్జరీ కంఫర్ట్ ఉన్న సీట్లు కూడా ఉండడం ఈ కార్ స్పెషాలిటీగా తెలుస్తుంది. ఇండియాలో ఈ కార్ కేవలం అతి తక్కువ మంది సెలబ్రెటీలకు మాత్రమే ఉందట. ఇక త్వరలో నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల వివాహం జరుగునుంది. ఈ ఏడది డిసెంబర్ 4న గ్రాండ్ లెవెల్ లో జరగనున్న వీళ్ళ పెళ్లి గిఫ్ట్ గా నాగార్జున ఆ కాస్ట్లీ కార్ కొన్నట్లు తెలుస్తుంది.