స‌మంత తండ్రి మృతికి అస‌లు కార‌ణం అదేనా.. ఏం జ‌రిగిందంటే..?

స్టార్ హీరోయిన్ సమంత తండ్రి జోసఫ్ ప్రభు కొద్ది గంటల క్రితం.. మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా సమంత తన సోషల్ మీడియా వేదిక వెల్లడించింది. మరణానికి కారణం ఏంటని విషయాన్ని ఆమె షేర్ చేసుకోలేదు. అయినా కార్డియాక్ అరెస్టుతో మరణించినట్లు తాజాగా వార్తలు వైరల్ అవుతున్నాయి. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జోసెఫ్.. శుక్రవారం మధ్యాహ్నం టైం లో కాస్త హార్ట్ బీటా సాధారణ రీతిలో కొట్టుకుని ఆగిపోయింద‌ట‌. ఇక స‌మంత తండ్రి ఆంగ్లో ఇండియ‌న్ ఆమె త‌ల్లి మ‌ళ‌యాళీ.. ఇక వీళ‌కు స‌మంత‌తో పాటు జోన‌థ‌న్‌ ప్రభు, డేవిడ్ ప్రభు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. సమంత ఇద్దరు అన్నయ్యలు నాగచైతన్యతో ప్రేమ పెళ్లికి మొదట అసలు ఒప్పుకోలేదట.

కూతురు ఇష్టాన్ని కాదనలేక.. తండ్రి అంగీకరించడంతో శ్యామ్ ఇరు కుటుంబాల సమక్షంలో చైతూని పెళ్లి చేసుకుంది. అయితే వీరి విడాకుల సందర్భంలో కూడా ఆమెకు అండగా సమంత తండ్రి నిలిచారట. ఆమెకు గ్రేట్ సపోర్ట్ ఇస్తూ ఉన్నారట. ఇక వీరి విడాకుల తర్వాత సమంత తండ్రి దీనిపై రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా ఆయన రియాక్ట్ అవుతు అన‌గ‌న‌గా ఓ కథ‌ ఉండేది.. ఇప్పుడా కథ‌ ముగిసిపోయింది. మరో కొత్త కథతో కొత్త అధ్యయనంతో జీవితం మొదలు పెట్టాలని సమంతను ఉద్దేశిస్తూ.. సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ ని షేర్ చేసుకున్నారు.

Samantha Ruth Prabhu's father Joseph Prabhu passes away | PINKVILLA

2017లో రెండు కుటుంబాల పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న ఈ జంట.. 2021లో విడాకులు తీసుకున్నారు. అయితే సమంత వైవాహిక జీవితం ఇలా ముగియడంతో ఆమె తండ్రి ఆవేదన చెందిన.. సమంతకు మాత్రం ధైర్యం చెబుతూ.. జీవితంలో ఆటుపోట్లు దాటుకొని ముందుకు సాగాలని చెబుతూ ఉండేవారట. లైఫ్‌ చాలా చిన్నది.. ఎమోషన్స్ లో చిక్కుకొని బాధపడుతూ కూర్చోకూడదు అంటూ సమంతకు వెల్లడించారట. ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్తోనే సమంత ఎన్నో కష్టాలను అవరోధించి ప్రస్తుతం ఈ స్టేజిలో ఉంది. ఇలాంటి సమయంలో సమంత తండ్రిని కోల్పోవడం ఆమెకు పెద్ద ఎదురు దెబ్బ అనడంలో సందేహం లేదు.