ప్రభాస్ సినిమాల్లో తనకు అసలు నచ్చని మూవీ తెలుసా.. ఇప్పటికి రీగ్రేట్ అవుతున్నాడా..?

పాన్ ఇండియా లెవెల్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ప్రభాస్.. ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ దూసుకుపోతున్నాడు. ఆయ‌న‌ నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలనుకుంటున్నాయి. ఇక సినిమాలు చేయడానికి కూడా ప్రొడ్యూసర్లు ముందుంటున్నారు. సినిమా కాసుల వర్షం కురిపిస్తుందని ఫుల్ కాన్ఫిడెన్స్ వారిలో ఉంటుంది. ఇక ప్రస్తుతం రెబల్ స్టార్‌గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న ప్రభాస్.. ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా యావ‌రేజ్ టాక్‌ దక్కించుకుంది. తర్వాత స‌లు సినిమాల‌లో న‌టించిన ప్రభాస్.. వర్షం తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలను ద‌క్కించుకుంటూ ఎన్నో సక్సెస్లు తన ఖాతాలో వేసుకుంటున్నాడు.

Raghavendra (2003) - IMDb

ఇలాంటి క్రమంలో ప్రభాస్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట‌ వైరల్ గా మారుతుంది. ప్రభాస్ తన మొత్తం కెరీర్‌లో చేసిన సినిమాలు అన్నిటిలో ఒక సినిమా ఎందుకు చేశానని ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాడట. ఇంతకీ ఆ సినిమా ఏంటి అనుకుంటున్నారా.. సురేష్ కృష్ణ డైరెక్షన్లో తెర‌కెక్కిన రాఘవేంద్ర మూవీ. ఈ సినిమాలో ప్రభాస్‌ను అనుకున్న రేంజ్ లో డైరెక్టర్ ప్రాజెక్ట్ చేయలేకపోయాడట. కనుక ఈ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ అందుకోలేదని.. ఒకానొక టైంలో ప్రభాస్ ఫ్రెండ్స్ కూడా ఆ సినిమా చేసినందుకు తనని ఆటపట్టించారని తెలుస్తుంది. అయితే ఈ సినిమా తర్వాత ప్రభాస్ నటించిన వర్షం సినిమా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసింది. దీంతో సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే కథలను అచితూచి ఎంచుకుంటూ సినిమాలో నటిస్తే దూసుకుపోతున్నాడు ప్రభాస్.

Varsham 2004 Full Movie Online - Watch HD Movies on Airtel Xstream Play

ఏదేమైనా రాఘవేంద్ర సినిమా.. ఆయన ఒక చక్కటి గుణపాఠం నేర్పిందని పలు సందర్భాల్లో స్వయంగా ప్రభాస్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఆయన మారుతి డైరెక్షన్‌లో రాజాసాబ్‌ సినిమాలో నటిస్తున్నాడు. కామెడీ హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత ఫౌజి మూవీ షూట్ లో బిజీ కానున్నాడు. ఈ సినిమాల్లో బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్గా ప్రభాస్ కనిపించినా.. తర్వాత స్పిరిట్ సెట్స్‌ పైకి వస్తుంది. ఈ సినిమాల్లో ప్రభాస్ మునుపెన్నడు కనిపించని విధంగా పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నాడని డైరెక్టర్ సందీప్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాదు వీటితో పాటే మరో మూడు నాలుగు సినిమాల‌ను లైన్లో పెట్టాడు రెబల్ స్టార్. ప్రస్తుతం ప్రభాస్ లైన్ అఫ్ చూసి స్టార్ హీరోస్ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఆయన స్పీడును అందుకోవడం ఆసాధారణమని.. అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోయే సినిమాలతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో వేచి చూడాలి.