అక్కినేని ఇంట త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. నాగార్జున నటవారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగ చైతన్య, అఖిల్ ఎంగేజ్మెంట్ లు తాజాగా జరిగిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ అక్కినేని వారసులు ఇద్దరు ఓ ఇంటివారు కాబోతున్నారు. ఈ క్రమంలోనే నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను ఈ ఏడాది డిసెంబర్ 4న వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఇక మరో నాలుగు రోజుల్లో వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ క్రమంలోనే వారి మంగళ స్నానల పిక్స్ కూడా నెటింట తెగ వైరల్గా మారాయి.
ఇక వీరి పెళ్లి.. అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా భారీ సెట్స్ లో చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నారు. అంతేకాదు.. అన్నపూర్ణ స్టూడియోస్‌లో అయితే అక్కినేని నాగేశ్వరరావు ఆశీస్సులు కూడా ఉంటాయని వారు భావిస్తున్నారు. ఇక ఇరు కుటుంబాల సమక్షంలో అతి తక్కువ మంది బంధుమిత్రుల మధ్యన వీరి పెళ్లి సాంప్రదాయబద్ధంగా జరగనుందని నాగార్జున ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైతు – శోభితల పెళ్ళికి నాగార్జున కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడని ఓ న్యూస్ నెటింట తెగ వైరల్ గా మారుతుంది.
ఇంతకీ ఆ గిఫ్ట్ మరి ఏదో కాదు తాజాగా నాగార్జున కొన్న ఓ లగ్జరి కార్ బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. దాదాపు రూ.2.5 కోట్ల విలువైన లేటెస్ట్ ట్రెండి లక్సస్ ఎల్ఎం ఎంపీవి కారును నాగార్జున కొనుగోలు చేశారు. ఈ కార్ చై, శోభితల పెళ్ళికి గిఫ్ట్‌గా ఇవ్వబోతున్నాడట నాగ్. ఇక ఈ కార్‌ని హైబ్రిడ్ ఎలక్ట్రిక్ డిజైన్ తో ఎంతో ట్రెండీగా రూపొందించారని.. కార్బన్ న్యూట్రల్ ఫీచర్స్ తో పాటు ఎన్నో లగ్జరీ ఫ్యూచర్స్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి.