సుకుమార్‌తో సినిమా చేస్తానని దారుణంగా హ్యాండ్ ఇచ్చిన ఆ స్టార్ హీరో.. ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరో, హీరోయిన్లుగా, డైరెక్టర్లుగా ఎదిగిన వారందరు ఏదో ఒక సందర్భంలో ఇబ్బందులు ఎదుర్కొన్న వారే. ఈ స్టేజ్ కు రావడానికి ఎన్నో కష్టాలు పడిన వారే. అలాంటి ఇబ్బందులు ఎదుర్కొని స్టార్ డైరెక్టర్ గా పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న‌ వాళ్ళలో పుష్ప డైరెక్టర్ సుకుమార్ ఒకరు. గతంలో సాధార‌ణ డైరెక్ట‌ర్‌గా ఓ సినిమా చేయడానికి స్టార్ హీరోను అప్రోచ్ అయాడ‌ట సుకుమార్‌.. ఇక ఆ హీరో సినిమా చేస్తానని చెప్పి చివరకు హ్యాండ్ చేశాడట. ఇంతకీ ఆ హీరో ఎవరు.. అసలు ఏం జరిగింది.. ఒకసారి తెలుసుకుందాం. సుక్కుని టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్, జీనియ‌స్ డైరెక్ట‌ర్‌, లెక్కల మాస్టర్ అని ఇలా ఎన్నో పేర్ల‌తో పిలుస్తుంటారు. టాలీవుడ్ లో తనదైన మేకింగ్ స్టైల్ తో హిస్టరీ క్రియేట్ చేసిన సుకుమార్.. ఎన్నో బ్లాక్ బ‌స్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఎంతో మంది స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించాడు.

Allu Arjun's Arya Completes 20 Years; Filmmakers To Celebrate The Milestone  | Times Now

హీరోలలో కూడా నెగిటివ్ షేడ్స్‌ చూపించిన ఘనత కేవలం సుకుమార్‌కే సొంతం. ఇక ఆయన తెరకెక్కించే సన్నివేశాలు.. మన అంచనాలకు అందనే అందవు. అంత అద్భుతంగా సినిమాలను రూపొందించే సుక్కు.. బన్నీ లాంటి హీరోని ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో తిరుగులేని హీరోగా నిలబెట్టాడు. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్ డైరెక్టర్గా కొనసాగుతున్నాడు. కాబట్టి సుకుమార్‌తో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సినిమా చేయడానికి వెయిట్ చేయాల్సిందే. ఆయన సినిమా చేస్తాడా అని ఎదురు చూడాల్సిందే. కానీ.. సుకుమార్ కెరీర్‌ బిగినింగ్ లో తన కథలను సినిమాగా తీయడానికి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడట.

Hero Nithiin To Support Telangana Congress?

చాలామంది హీరోలను తన సినిమా కోసం తెగ ట్రై చేశాడట. ఈ క్రమంలోనే సుకుమార్ ఆర్య సినిమాను అప్పటి ఓ యంగ్ హీరోతో చేయాలని భావించాడట. అల్లు అర్జున్ హీరోగా వ‌చ్చి బ్లాక్ బాస్టర్ గా నిలిచిన ఈ సినిమాను మొదటి సుకుమార్ నితిన్‌తో తీయాలని భావించాడట. సుక్కు ఫస్ట్ మూవికి నితిన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడ‌ట‌. కానీ డేట్స్ ఇవ్వకుండా తప్పించుకున్నాడట. చాలాకాలం అలా బ్లాక్ చేసిన నితిన్.. చివరకు సినిమా చేయనని చెప్పి హ్యాండ్ ఇచ్చేసాడట. ఇక ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారడంతో నితిన్ కచ్చితంగా ఈ సినిమా చేసి ఉంటే అప్పట్లో ఆయన మార్కెట్ మరింతగా పెరిగేదని.. నితిన్కి ఈపాటికి స్టార్ హీరో అయ్యు ఉండేవాడ‌ని చాలామంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా నితిన్ సినిమా చేస్తానని చెప్పి డేట్స్ ఇవ్వకుండా చివరికి సుకుమార్ కు హ్యాండిచ్చినందుకు ఆయనకే భారీ నష్టం కలిగిందంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.