హలో బ్రదర్ మూవీలో నాగార్జున డూప్ ఆ స్టార్ హీరోయే…!

అక్కినేని నాగార్జున హీరోగా.. సౌందర్య, రమ్యకృష్ణలు హీరోయిన్గా నటించిన మూవీ హలోబ్రదర్. ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్‌లో దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిన ఈ సినిమాకు రాజ్, కోటి సంయుక్తంగా సంగీతమందించారు. వీరిద్దరూ కలిసి మ్యూజిక్ కంపోజ్‌ చేసిన ఆఖరి సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇక సినిమాలో పాటలు, కంటెంట్.. ఈవీవీ మార్క్ కామెడీ అన్ని మరింత హైలెట్గా నిలిచాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడానికి కారణమయ్యాయి.

అయితే ఇందులో నాగార్జున నటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఓ పాత్ర పూర్తిగా ఊర మాస్‌ కాగా.. రెండో పాత్ర ఫుల్ క్లాస్.. సాఫ్ట్ గా ఉంటుంది. ఇక మూవీలో నాగార్జున డ్యూయ‌ల్ రోల్‌లో ఫుల్ లెన్త్ కనిపిస్తాడు. ఈ క్రమంలోనే రెండు పాత్రలను ఒకేసారి స్క్రీన్ పై చూపించాల్సిన క్రమంలో.. ఖచ్చితంగా డూప్ వాడాల్సి ఉంటుంది. ఇక అప్పట్లో.. ఇప్పుడు ఉన్నంత టెక్నాలజీ ఆధునీకరణ అస్సలు లేదు. ఇలాంటి క్రమంలో వారిద్దరి క్యారెక్టర్‌లను ఒకేసారి స్క్రీన్ పై చూపించాలంటే అదో పెద్ద టాస్క్‌లా ఉండేది. ఇక హలో బ్రదర్ సినిమాలో నాగార్జున రెండు క్యారెక్టర్లు ఒకే తెరపై కనిపించిన సమయంలో డూప్ వాడాల్సి వచ్చిందట‌.

Srikanth Meka - Happy birthday to dearest #Nagarjuna... | Facebook

అయితే నాగార్జున డూప్‌గా ఈ సినిమాలో స్టార్ హీరో నటించారట. అతను ఎవరో కాదు శ్రీకాంత్. హలో బ్రదర్‌లో నాగార్జునకు.. శ్రీకాంత్ డూప్‌గా కనిపించిన విషయాన్ని బిగ్‌బాస్‌లో నాగార్జుననే స్వయంగా వివరించారు. హలో బ్రదర్ సినిమాల్లో తనకు డూప్‌గా శ్రీకాంత్ కనిపించారని వెల్లడించారు. ఇక వీరిద్దరి కాంబోలో ఈ వీవీ సత్యనారాయణ డైరెక్షన్‌లోనే వారసుడు సినిమా కూడా తెర‌కెక్కింది. నాగార్జున, శ్రీకాంత్‌ల‌ పర్సనాలిటీలు దగ్గరగా ఉండడంతో.. హలో బ్రదర్స్ లో నాగార్జునకు డూప్ గా శ్రీకాంత్ కనిపించాడట. ఇక ఈ సినిమాలో నటించిన ఇతర నటీనటులకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. అలా నాగార్జున ఇప్పటివరకు డ్యూయల్ రోల్‌లో నాలుగు సినిమాల్లో నటించి మెప్పించాడు.