ఆ సినిమా ఇష్టం లేక‌పోయినా చేశా… అందుకే ఆ రిజ‌ల్ట్ వ‌చ్చింద‌న్న చిరంజీవి..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలో నటిస్తున్న చిరు.. ప్రస్తుతం విశ్వంభర సినిమాతో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. డైరెక్షన్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో త్రిష, ఆషిక‌ రంగనాథన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. సోషియా ఫాంటసీ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.

Daddy (2001) - IMDb

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవి.. తన సినీ కెరీర్‌కు సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. డాడీ కథను నాకు వినిపించినప్పుడు వెంటనే ఇది నాకంటే వెంకటేష్‌కు బాగుంటుందనిపించింది. ఈ కథకు న్యాయం చేయగలరని భావించా. దీంతో రచయిత భూపతి రాజుకి వెంటనే విషయాన్ని చెపా. ఇది ఆయనకు సాధారణంగానే ఉంటుంది. మీకైతే ఫ్యామిలీ మ్యాన్‌గా కాస్త రోడ్డుకు భిన్నంగా అనిపిస్తుందని భూపతి రాజు నన్ను కన్విన్స్ చేశారు. అయినా నేను కాస్త ఆలోచించా.. ఈ కథ విన్న వారందరూ చిన్నపిల్లలతో మీకు సినిమా అంటే మీకు బాగుంటుందంటూ సలహా ఇచ్చారు.

Happy Birthday to Victory Venkatesh!

దీంతో చేసేదేమీ లేక నేను కూడా బలవంతంగానే డాడీ సినిమాకి ఒప్పుకున్నా రిజల్ట్ కూడా నేను ఒప్పుకున్నట్లే వచ్చింది కథ విన్నప్పుడు ఏమనుకున్నాను అదే జరిగిందంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వెంకటేష్ నాకు స్వయంగా కాల్ చేసి భ‌లే మూవీ అండి అన్నాడని.. నేను ఆ సినిమా తీసి ఉంటే ఇంకా బాగా ఆడేది అనేసాడని చెప్పుకొచ్చాడు. నీకు అయితే బాగుండేదని నేను చెప్పా వెంకటేష్ కానీ.. ఆయినా వినలేదు అలాంటి ఫెయిల్యూర్స్ నా సినీ లైఫ్ లో చాలానే ఉన్నాయి అంటూ అయిన చెప్పుకొచ్చాడు అంటూ చిరంజీవి వివరించాడు. ప్రస్తుతం చిరంజీవి కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి.