ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటైడ్ మూవీ పుష్ప 2. రష్మిక మందన హీరోయిన్‌గా శ్రీలీల ఐటం క్వీన్‌గా మెరిసిన ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో కనీ..వినీ ఎరుగని రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. ఇక.. మరో మూడు రోజుల్లో సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో మరింత జోరు పెంచారు మేకర్స్. ఇప్పటివరకు రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇలాంటి క్రమంలో సినిమా ప్రీమియర్స్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. పుష్ప 2 ది రూల్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 1200+ స్క్రీన్ లతో భారీగా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.
పుష్ప ఆరు భాషల్లో రిలీజ్ కానుండగా.. ఇప్పుడు అభిమానులలో మరింత ఉత్సాహం నెలకొంది. ఫ్రీ రిలీజ్ ప్రీవియర్స్‌కు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పుష్ప 2.. హిస్టరీ సృష్టించడం ఖాయం అనేలా ఆడియన్స్‌లో క్రేజ్ ఉంది. ఇక ఈ సినిమా ఓపెనింగ్ రోజున రూ.250 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించడం పక్కా అంటూ అంచనాలు వెలువడుతున్నాయి. ఒకవేళ ఇదే రికార్డు నిజమైతే.. భారతీయ సినిమాల్లోనే సరికొత్త రికార్డు పుష్ప 2.. సృష్టించిన ఘనత సాధిస్తుంది. ఇక పుష్ప 2 ది రూల్.. ఫ్రీ రిలీజ్ ప్రీమియర్స్ వివరాల్లోకి వస్తే.. మొదట మెకర్స్ సినిమాని ప్రధాన ప్రాంతాల్లో రాత్రి ఒంటిగంట నుంచి మిడ్ నైట్ షో లతో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారట. అయితే.. అనుకోని చాలెంజ్‌లు ఎదురవుతున్న క్రమంలో.. ప్లాను సరికొత్తగా రూపొందింయనున్నారని టాక్.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మిడ్ నైట్ స్క్రీనింగ్ ఆపేయాలని చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇది మేకర్స్‌కు పెద్ద దెబ్బ అవుతుంది. అలాగే పుష్ప 2 కొత్త రికార్డులు సెట్ చేయాలని లక్ష్యంతో.. అదనంగా టికెట్ ధరలలో పెంపు కోసం ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి దరఖాస్తు చేసుకుంది. అయితే.. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను పెంచడానికి సిద్ధంగా ఉన్నాయా.. లేదా.. అనే దానిపై మాత్రం ఇప్పటికీ క్లారిటీ రాలేదు. దానికి కారణం.. ఒక టికెట్ కు 600 దాకా మేకర్స్ అడుగుతున్నట్లు సమాచారం. పుష్ప 2 తెలుగు రాష్ట్రాల నుంచి కచ్చితంగా రూ.220 కోట్ల షేర్ సాధించాల్సి ఉంది. టీం ఇప్పుడు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారని.. ఆ జోరు కొనసాగించడానికి వేరే ప్లాన్లను అన్వేషిస్తున్నట్లు టాక్. పుష్ప 2కు డిసెంబర్ 4.. రాత్రి 10:00 నుంచి ప్రారంభమయ్యే ఫ్రీ రిలీజ్ ప్రీమియర్లకు ప్లాన్ మొదలుపెట్టారట. ఇవి మిడ్ నైట్ షోల నుంచి వచ్చే ఆదాయ నష్టాన్ని భర్తీ చేయడానికి ఉపయోగపడతాయని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ, దేశవ్యాప్తంగా రిలీజ్ చేయడమే మేకర్స్ టార్గెట్గా పెట్టుకున్నట్లు తెలుస్తుంది.