అక్కినేని ఫ్యామిలీలో వరుస శుభకార్యాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కినేని ఇంట నాగచైతన్య, శోభితల పెళ్లి సందడి మొదలైంది. మరో రెండు రోజుల్లో చైతన్య, శోభిత వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ క్రమంలో వీరికి సంబంధించిన ప్రతి చిన్న విషయం నెటింట వైరల్‌గా మారుతుంది. ఇలాంటి క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య.. శోభితతో పరిచయం గురించి తన ఫ్యామిలీ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. అయితే శోభిత కూడా నాగచైతన్యతో ప్రేమలో పడడం గురించి.. కొన్ని విషయాలను అభిమానులతో పంచుకుంది.
శోభిత.. నాగచైతన్యతో ప్రేమలో ఎలా పడ్డారు.. ఏంటి.. అనే విషయాల గురించి ఈ ఇంటర్వ్యూలో వెల్లడించింది. చేతును మొదటిసారి ఓటీటీ షోలో కలిసా. ఆయనతో పరిచయం ఏర్పడిన తర్వాత అతని క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చేసింది.. చాలా కూల్ అండ్ కామ్ గా వ్యవహరిస్తారు. ఏ విషయానికి తొందరపడరు.. ఆవేశపడరు.. ఎంతో మంచి వ్యక్తిత్వం.. ఆడంబరలకు పోడు.. చాలా సింపుల్ గా ఉంటాడు. అతనిలో ఉన్న ఈ క్వాలిటీస్ నాకు బాగా నచ్చాయి. అంతేకాదు.. ఆయనతో ప్రేమలో పడేలా చేశాయి అంటూ శోభిత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శోభిత చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.
ఇక వీరిద్దరి వివాహం డిసెంబర్ 4 రాత్రి 8 గంటలకు గ్రాండ్ లెవెల్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీరి హల్దీ, మంగళ స్నానాలు పిక్స్ నెటింట తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ జంట పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్‌లో భారీ వెడ్డింగ్ సెట్స్ జరగనున్న సంగతి తెలిసిందే. అక్కడ వీళ పెళి జరిగితే ఏఎన్ఆర్ ఆశీర్వాదాలు కూడా ఉంటాయని.. అంతేకాదు.. తెలుగు సాంప్రదాయ పద్ధతిలో వీరు పెళ్లిని చాలా ఘనంగా నిర్వహించాలని.. అక్కినేని కుటుంబంతో పాటు.. శోభిత ఫ్యామిలీ కూడా నిర్ణయించుకున్నారట. అయితే చైతు, శోభితల నిర్ణయం ప్రకారం పెళ్లి చాలా సింపుల్ గా అతి తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో చేయనున్నట్లు నాగార్జున ఇప్పటికే వెల్లడించారు.