ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప 2 మ్యానియా కొనసాగుతుంది. పుష్ప పేరే మారుమోగిపోతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రష్మిక మందన హీరోయిన్గా నటించిన సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తర్కెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మరో నాలుగు రోజుల్లో సినిమా రిలీజ్ కానున్న క్రమంలో సినిమా పై బజ్ మరింతగా పెరిగింది. ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అంటూ.. టాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు.. పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి క్రమంలో పుష్ప 2 మేకర్స్.. టికెట్ ధరల పెంపుతో తమ పెట్టుబడులను ఎలాగైనా తిరిగి తెచ్చుకోవాలని.. బ్రేక్ ఈవెన్ రీచ్ కావాలని.. కొత్త స్ట్రాటజీలు వాడుతున్నారు.
ఈ క్రమంలోనే పుష్ప 2 టికెట్ల రేట్లు మునుపెన్నడు లేని విధంగా భారీగా పెంచనున్నట్లు సమాచారం. ఇప్పటికే టీజీ, ఏపీ గవర్నమెంట్ లకు దీనిపై దరఖాస్తు చేసుకున్నారని.. వీరు విన్నపాన్ని గవర్నమెంట్ అంగీకరిస్తే టికెట్లు రేట్లు పెంపు పుష్ప 2 మేకర్స్ కు మరింత ప్లస్ అవుతుంది అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా తెలంగాణ ప్రభుత్వం పుష్ప 2 టికెట్ల ధర భారీ పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. డిసెంబర్ 4న రాత్రి 9:30 షో నుంచి అర్ధరాత్రి ఒంటిగంట బెనిఫిట్ షో వరకు సినిమా ప్రీమియర్ షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
అంతేకాదు టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ లలో ఈ బెనిఫిట్ షోలకు ఏకంగా రూ. 800 కు ఫిక్స్ చేసిందని తెలుస్తుంది. ఇక డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్ రూ.150, మల్టీప్లెక్స్ రూ.200 చొప్పున.. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్ రూ.105 మల్టీప్లెక్స్ రూ.150 చొప్పున టికెట్లు పెంచుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసిందట. ఈ క్రమంలో ఒక్క టికెట్ ధర సింగిల్ స్క్రీన్ కు రూ.350 మల్టీప్లెక్స్ కు రూ.400 వరకు పెంచుకోవచ్చు. ఇక డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్ కు రూ.300 మల్టీప్లెక్స్ కు రూ.350 చొప్పున చార్జ్ చేసే అనుమతులు టీజీ గవర్నమెంట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పుష్ప 2 టికెట్ ధరల భారీ పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.. మేకర్స్ దరఖాస్తుకు ఏపి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.