ఆ విషయంపై మాట్లాడడం ఇష్టం లేదు.. స్టేజ్‌పై బన్నీ షాకింగ్ కామెంట్స్.. !

టాలీవుడ్ స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో పాన్ ఇండియా ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాన్ ఇండియన్ స్టార్ అనే టాక్‌తో పాటు.. ఆటిట్యూడ్ కూడా బాగా పెరిగిపోయిందని.. పొగరుతో బిహేవ్ చేస్తున్నాడు అంటూ విమర్శలు తెగ వైరల్ గా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బన్నీ ఫ్యాన్స్‌ ఐకాన్ స్టార్, స్టైలిష్ స్టార్ అంటూ పిలుస్తుంటే.. బ‌న్నీ హేట‌ర్స్‌ మాత్రం ఈగో స్టార్, ఆటిట్యూడ్ ఫెలో అంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బన్నీకి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారుతుంది. దానికి కారణం పుష్ప 2. మూవీ మరికొద్ది రోజులు రిలీజ్ కానున్న క్ర‌మంలో ఎక్కడ చూసినా పుష్ప 2 మానియా కొనసాగుతుంది. కోట్లాదిమంది అభిమానులు వెయిట్ చేస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న థియేటర్‌ల‌కి రానుంది. ఈ క్రమంలోనే సినిమా సక్సెస్ కోసం ఓ పక్కన బన్నీ హీరోయిన్ రష్మిక మందన కూడా ప్రమోషన్స్‌లో తెగ కష్టపడుతున్నారు.

ప్రతి స్టేట్లో సినిమాను ప్రమోట్ చేస్తూ సందడి చేస్తున్నారు, ఇప్పటికే మ్యూజికల్ ఈవెంట్ చెన్నైలో నిర్వహించగాచ పాట్నాలో ట్రైలర్ లాంచ్, కేరళలో ఓ మ‌ల్లు స్పెషల్ సాంగ్ ప్రోమో ఇలా రకరకాలుగా సినిమాను ప్రమోట్ చేస్తూ వచ్చారు. తాజాగా ముంబైలో నిర్వహించిన ప్రెస్ మీట్ బ్లాక్ బ‌స్టర్ గా నిలిచింది. చాలా హుందాగా బన్నీ మాట్లాడుతూ.. తన ఒక క్రేజ్ ను రెట్టింపు చేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఈవెంట్లోనే సినిమాల్లో బన్నీ వేసుకున్న అమ్మవారి గెటప్ కు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు ఎదురయ్యాయి. బన్నీ కూడా వాటికి చాలా బ్రిలియంట్ ఆన్సర్లు ఇస్తూ వచ్చాడు. ఇనేళ‌ తన కెరీర్‌లో ఎప్పుడు కూడా అసలు ఇలాంటి క్యారెక్టర్ చేస్తాననుకోలేదని చెప్పినా బన్నీ.. మీరంతా తెరపై చూసినంత ఈజీగా అమ్మవారి గెటప్ సెట్ అవ్వలేదు అంటూ చెప్పుకొచ్చాడు. దానికోసం ఎన్నో రాత్రులు కష్టపడాల్సి వచ్చిందని.. నేను సుకుమార్ పడిన కష్టానికి తగ్గ ఫలితం కోసం ఎదురు చూస్తున్నాం అంటూ వెల్లడించాడు.

 

ఇక బన్నీ మాట్లాడుతూ అందరిలా నేను ఈ సినిమా కోసం అంత కష్టపడ్డా.. ఎంత కష్టపడ్డా అని చెప్పుకోవడానికి ఇష్టపడనని.. ఆ విషయం గురించి మాట్లాడడం నాకు అసలు నచ్చదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. సినిమా కోసం మేము కష్టపడ్డ తీరు మాకు తెలుసు. సినిమా కోసం పడిన కష్టం మేము మాత్రమే అనుభవించాం.. రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నామంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బన్నీ చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారడంతో.. ఇష్టం లేదంటూనే తను ఎంతో కష్టపడ్డాను అని చెప్పకనే చెప్పేసాడుగా.. ఇంకేంటి ఓవరాక్షన్ అంటూ నెగిటీవ్ కామెంట్స్ చేస్తుంటే.. మరి కొంతమంది మాత్రం.. చీర కట్టులో అమ్మవారు గెట‌ప్‌లో విజృంభించడం అంటే అది సాధారణ విషయం కాదు.. బన్నీ అందరికంటే డిఫరెంట్.. ఇలాంటి పాత్రలో బన్నీ అవకాశం వస్తే తన సత్తా తప్పక చాటుతాడు అంటూ వివ‌రించారు. ఈ సినిమాకు అసలు కర్త, కర్మ, క్రియ మొత్తం కూడా జాతర ఎపిసోడ్స్ అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పటికే సినిమాలో జాతర సీన్ హైలెట్ అంటే ఎన్నో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అంతలా సర్ప్రైజ్ చేసే కంటెంట్ ఏముందో.. సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.