మలయాళ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టి.. తమిళ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్‌లోను హీరోయిన్గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. ఇంతకీ ఈ పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఒకప్పుడు వరుసగా తెలుగు సినిమాలలో నటించి మెప్పించిన ఈ అమ్మడు.. తమిళ్ స్టార్ డైరెక్టర్‌ని ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే మనస్పర్ధలు కారణంగా వీరు విడిపోయారు. తర్వాత హీరో ధనుష్‌తో ఈ అమ్మడికి ఎఫైర్ ఉందంటూ వార్తలు వినిపించాయి.
అంతేకాదు డైరెక్టర్‌తో విడాకుల తర్వాత ఆరేళ్ల గ్యాప్ తో మరొక వ్యక్తిని ప్రేమించి.. పెళ్లికి ముందే గర్భవతి అయిన ఈ అమ్మడు.. అతని వివాహం చేసుకొని పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఇంత చెప్పాం కదా ఇప్పటికైనా ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. సర్లేండి మేము చెప్పేస్తాం. ఆమె అమలాపాల్. సింధు సమావెలి సినిమాతో కోలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ అమ్మడు.. మొదటి సినిమాతో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. తర్వాత మైన సినిమాలో ఆకట్టుకుంది. తర్వాత కోలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కించుకుని తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా మారింది.
విజయ్ జంటగా తలైవా సినిమాలో నటిస్తున్న సమయంలో డైరెక్టర్ ఏఎల్ విజయ్ తో ప్రేమాయణం లో పడిన ఈ అమ్మడు 2017లో అతని వివాహం చేసుకుంది. పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు 2017లో మనస్పర్ధలతో అతనికి విడాకులు ఇచ్చేసింది. ఇక విరి విడాకుల తర్వాత దాదాపు ఆరేళ్ల గ్యాప్ తో జగత్ దేశాయ్ అనే వ్యక్తిని ప్రేమించిన ఈ ముద్దుగుమ్మ.. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది. పెళ్ళైన 8 నెలలకే బిడ్డకు జన్మనిచ్చి అందరిని సర్ప్రైజ్ చేసింది. గత జూన్ లో కొడుకుకు జన్మనిచ్చిన అమలాపాల్ తర్వాత సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం తన కొడుకు ఆలనా పాలన చూసుకుంటూ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తుంది.