తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొల్పి మోస్ట్ ఎవైటెడ్‌గా తెరకెక్కుతున్న మూవీ పుష్ప 2. ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాలో.. రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రీ లీల ఐటమ్ క్వీన్‌గా మెరవనుంది. ఇక మరో నాలుగు రోజుల్లో సినిమా రిలీజ్ కానున్న క్రమంలో సినిమా ప్రమోషన్స్ మరింత జోరుని పెంచారు మేకర్స్. ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్, ప్రోమోషన్స్ అన్ని ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే మొన్న చెన్నై, నిన్న ముంబై లలో గ్రాండ్ గా ప్రమోషన్ కండక్ట్ చేసిన మూవీ టీం.. నేడు హైదరాబాద్ ప్రమోషన్స్ కు సిద్ధమవుతుంది.
అంతేకాదు ఆంధ్రప్రదేశ్‌లోనూ చిత్తూరులో ప్రత్యేక ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఎవరైన ప్రమోషన్స్ లో మాట్లాడడానికి కాస్త ఆలోచిస్తారు. కానీ.. అల్లు అర్జున్ మాత్రం దీనికి పూర్తి డిఫరెంట్గా వెళ్తున్నారు. పుష్పా 2 ప్రమోషన్స్‌లో అడిగి మరీ సాంగ్‌లకు స్టెప్పులు వేస్తున్నారు. మొన్న తమిళనాడు, నిన్న ముంబై ఈవెంట్లలో తాను చేసిన ప్రమోషన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే పుష్ప గాడి ప్రమోషన్స్ ఫిక్స్ లెవెల్ అంటూ ఇండస్ట్రీని షేక్ చేయడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న సినిమా అడ్వాన్స్ బుకింగ్ నవంబర్ 30 మధ్యాహ్నం 12 నుంచి దాదాపు అన్ని చోట్ల ప్రారంభమైంది. ఇక ఇప్పటికే తెలంగాణ టికెట్స్ రేట్స్ భారీగా పెంపుకు గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బెనిఫిట్ షో టికెట్లను దాదాపు రూ.800 కు ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. అంతేకాదు డిసెంబర్ 5 నుంచి 8 వరకు సినిమాకు రూ.400 వరకు టికెట్ రేట్లు ఉండనున్నాయని.. 9 నుంచి 16 వరకు రూ.350 వరకు టికెట్లు అమ్మన్నట్లు సమాచారం. అయితే ఏపీ టికెట్ రేట్ల పెంపు విషయంలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. దీనిపై రేపటిలోపు క్లారిటీ రానుంది. ఏపీ గవర్నమెంట్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే.. ఏపీలోనూ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేస్తారట మేకర్స్.