” పుష్ప 2 ” విషయంలో మేకర్స్ రాంగ్ డెసిషన్.. సినిమాకు భారీ బొక్క తప్పదా.. ?

టాలీవుడ్ ఐకాన్ స్టార్‌ అల్లుఅర్జున్ హీరోగా, రష్మిక బంధన్ హీరోయిన్గా నటిస్తున్న తాజా మూవీ పుష్ప 2 పై కని..విని.. ఎరుగని రేంజ్లో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్‌లో అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా రిలీజ్‌కు మరో మూడు రోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ మరింత జోరు పెంచారు మేకర్స్. డిసెంబర్ 2న హైదరాబాద్ యూసఫ్‌గూడా పోలీస్ గ్రౌండ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకను భారీ లెవెల్ లో.. అభిమానులను ఫుల్ ఖుషి చేసే విధంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈవెంట్ కు సంబంధించిన టికెట్ ధరల విషయంలోనే మేకర్స్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారంటూ అసంతృప్తి వ్యక్తం అవుతుంది.

Pushpa 2 Hyderabad Event Update (Pushpa 2 Pre Release Event)

టికెట్ ధరలు నార్మల్గా ప్రజలకు అందుబాటులో లేనివిగా ఉండడంతో వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప 2 సినిమాపై ఉన్న ప్రేమతో ఈవెంట్ కు హాజరు కావాలని అనుకుంటున్నా అభిమానులంతా.. అధిక ధరల కారణంగా వెనక్కు తగ్గాల్సి వస్తుందని.. ఈవెంట్ కు హాజరుకాలేని పరిస్థితి నెలకొంటుందని.. అందరికీ అందుబాటు ధరల్లో టికెట్లు ఉంచాలని అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక పుష్ప ఫ్యాన్స్‌కు ఈ ఈవెంట్ ఎంత స్పెషల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప పార్ట్ 1 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో.. రెండో భాగంపై మరింత అంచనాలు పెరిగాయి.

Rs 1200 per ticket! Allu Arjun's Pushpa 2 smashes all records

పుష్ప 2 రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమని సరికొత్త సంచలనాలు సృష్టిస్తుందంటూ సినీ వర్గాల నుంచి.. ఇటు ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి క్రమంలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ టికెట్ ధరలు ఆ సంతోషాన్ని ఆవిరి చేస్తున్నాయి. ఒకవేళ హైదరాబాద్ ఈవెంట్ ధ‌ర‌లు ఫ్యాన్స్‌కు అందుబాటులో లేక ఫెయిల్ అయితే.. పుష్ప 2 సక్సెస్ విషయంలోనూ భారీ బొక్క తప్పదు అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టికెట్లు అందరికీ అందుబాటు ధరల్లో ఉంచి.. ఈవెంట్లో పాల్గొని సక్సెస్ చేసేలా మేకర్స్‌ ప్లాన్ చేయాలని.. ఈవెంట్ టికెట్ ధరల విషయంలో ఫ్యాన్స్ చెందుతున్న నిరాశ మేకర్స్ వరకు చేరుకోవాలని.. అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.