పాన్ ఇండియా మార్కెట్ లేని మహేష్‌తో పాన్ వరల్డ్ మూవీ.. జక్కన్నది రిస్కేనా..?

ఇండస్ట్రీ ఏదైనా.. పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది ఆ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోస్ మాత్రమే. ఎందుకంటే తెరపై అభిమానులను ఆదరించి.. వారిని ఆకట్టుకునేది సెలబ్రిటీలే కాబట్టి. వాళ్లకే ఎక్కువగా గుర్తింపు వస్తుంది. డై హార్ట్‌ ఫాన్స్ కూడా ఉంటారు. టాలీవుడ్ లో అలా.. ఉదాహరణకు బాహుబలి సినిమా.. ఈ పేరు చెబితే టక్కున గుర్తుకు వచ్చేది ప్రభాస్ పేరే. డార్లింగ్ తర్వాతే జక్కన్న పేరు వినిపిస్తుంది. ఇక తెరపై ప్రభాస్ కనిపిస్తున్నాడు అంటే థియేటర్లకు అభిమానులు క్యూ కడతారు.

S. S. Rajamouli • BollywoodPrime

టాలీవుడ్ ఇండస్ట్రీ ఈ రేంజ్ లో సక్సెస్ సాధించడానికి ప్రధాన కారణం ప్రభాస్ అని కూడా ఎప్పటికప్పుడు అభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉంటాయి. అలా ఏ సినిమా అయినా.. సక్సెస్ సాధించాలంటే సినిమాలో నటించే హీరోదే అల్టిమేట్ రోల్ ఉంటుంది. అలాగే సినిమా సక్సెస్ అయితే క్రెడిట్ కూడా ఆయనకే ఎక్కువగా దక్కుతుంది. ఇక దర్శకులకు, ఇతర పాత్రలకు పెద్దగా క్రేజ్ ఉండదు అనడంలో అతిశయోక్తి లేదు. ఏది ఏమైనా రాజమౌళి మాత్రం ఈ టాక్‌కు కాస్త భిన్నంగా టాలీవుడ్ నెంబర్ వ‌న్ డైరెక్టర్‌గా హీరోలను తలదన్నే క్రేజ్ ను సంపాదించుకుంటున్నాడు.

𝗧𝗵𝗲 𝗠𝗔𝗛𝗘𝗦𝗛 𝗕𝗔𝗕𝗨 𝗦𝗧𝗔𝗥™ | Long Hair & Beard 🥵 . . 🚫Please  don't repost. Story reshares are appreciated👏🏻 . . #SSMB29 #GlobeTrotting  #GlobeTrottingActionAdventure .... | Instagram

తనకంటూ ఒక ఐడెంటిటీతో దూసుకుపోతున్నాడు. ఇక ప్రస్తుతం రాజమౌళి పాన్ వరల్డ్ రేంజ్ లో సత్తా చాటడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఓ స్టార్ హీరోకు ఎంత క్రేజ్ ఉంటుందో జక్కన్నకు అంతకు మించిన క్రేజ్ ఉందన్నడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి క్రమంలో మహేష్ లాంటి టాలీవుడ్ స్టార్ హీరో తో ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా లేకుండా.. డైరెక్ట్ గా రాజమౌళి పాన్ వరల్డ్ సినిమా తీయడానికి సిద్ధమవుతున్నాడు. ఆ సినిమాతో సక్సెస్ సాధించాలని భావిస్తున్నాడు. ఇది నిజంగా జక్కన్నకు బిగ్ రిస్క్ అనడంలో అతిశయోక్తి లేదు. చూడాలి మరి ఈ సినిమా రిలీజ్ అయ్యా ఇలాంటి రిజల్ట్ అందుకుంటుందో.