యూసఫ్‌గూడ గ్రౌండ్‌లో ” పుష్ప 2 “.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే బాక్సాఫీస్ బ్లాస్టే.. !

మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప ది రూల్ ప్రమోషన్స్ ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాల్లో మొదలయ్యాయి. మొదట ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు రంగం సిద్ధమైంది. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించాలని అనుకున్న ఈ ఈవెంట్‌ అనుమతులు దొరకకపోవడం, ఇతర కారణాలతో చివరి నిమిషంలో యూసఫ్‌గూడా మైదానంలో చేసుకోవాలని పర్మిషన్ తెచ్చుకున్నారు. ఇక నేడు ఆదివారం కావడంతో జనం మరింతగా పెరగనున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు స్ట్రిక్ట్‌ బందోబస్తు ఏర్పాటు చేయడంలో బిజీగా ఉన్నారు. అయితే.. యూసఫ్‌గూడా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే సెంటిమెంట్ కూడా ఉందంటూ న్యూస్ ఒక‌టి తెగ‌ వైరల్‌గా మారుతుంది. ఇది అభిమానులకు నిజంగానే గుడ్ న్యూస్. గతంలో అలవైకుంఠపురంలో, పుష్ప వ‌న్‌ సినిమాల ఈవెంట్లు యూసఫ్‌గూడా గ్రౌండ్స్‌లోనే నిర్వహించారు.

Pushpa 2 Hyderabad Event Update (Pushpa 2 Pre Release Event)

ఇక సినిమాల్లో ఒకటి ఇండస్ట్రియల్ హిట్గా రికార్డులు బద్దలు కొడితే.. మరొకటి అల్లు అర్జున్ కెరీర్ లోనే బ్లాక్ బాస్టర్ గా పాన్ ఇండియా లెవెల్‌లో సత్తా చాటింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి యూసఫ్‌గూడా గ్రౌండ్స్‌లో బన్నీ నెక్స్ట్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. ఈ క్రమంలోనే పుష్ప 2 అల్లు అర్జున్ క్రేజ్ మరింతగా పెరగడం ఖాయమని.. మార్కెట్ పిక్స్ లెవెల్ కి వెళుతుందని.. ఈ సినిమాతో మరోసారి పుష్పరాజ్ సంచల రికార్డులు క్రియేట్ చేస్తాడంటూ అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక పుష్ప 2కు కూడా ఆ రెండు సినిమాల సెంటిమెంట్ వర్క్ అయితే కచ్చితంగా బాక్సాఫీస్ బ్లాస్టే అన‌డంలో అతిస‌యోక్తి లేదు. నిజానికి ఈ గ్రౌండ్స్ చాలా చిన్నవే.

Hyderabad to Host Grand Pre-Release Event for 'Pushpa 2'

పాట్నా, చెన్నైలోనే ఏకంగా వేల మంది వచ్చి ఈవెంట్‌లో సందడి చేస్తే.. ఇక హైదరాబాద్ అంటే ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. లిమిటెడ్ పాస్‌లు ఇచ్చినా అపరిమితంగా వచ్చే ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేయడం పెద్ద టాస్క్ అవుతుంది. పోలీసులకు అది కత్తి మీద సామే అవుతుంది. ప్రస్తుతం అందరి చూపు బన్నీ పైనే. ఈవెంట్లో ఫ్యాన్స్‌కు ఆయ‌న‌ ఏం చెప్పబోతున్నాడు.. స్టేజిపై ఏం జరుగుతుంది.. ఇప్పటికే దాదాపు అన్ని ముచ్చట్లు పూర్తయ్యాయి.. ఈ క్రమంలోనే డైరెక్టర్ సుకుమార్ స్పీచ్ ఆడియన్స్‌లో ఆసక్తి నిలబెడుతుంది. మూడేళ్లుగా మీడియాకు చెప్పకుండా ఇంటర్వ్యూలు ఇవ్వకుండా తప్పించుకుంటున్న సుక్కు.. మొదటిసారి పబ్లిక్ స్టేజ్ పై సందడి చేయనున్నారు. ఆయనపై ఎంత ప్రేమ ఉందో ముంబైలో ఓపెన్ గానే ఐకాన్ స్టార్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక తనకు డైరెక్టర్గా ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన బన్నీ గురించి సుకుమార్ ఏ రేంజ్ లో ఎలివేట్ చేస్తాడో.. పుష్ప 2 గురించి ఎలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంటాడు వేచి చూడాలి.