అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత దూళిపాళ్ల మరో రెండు రోజుల్లో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. ఎలాంటి హంగులు ఆర్బాటాలు లేకుండా చాలా సింపుల్గా వీరు పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా భారీ వెడ్డింగ్ సెట్లో వివాహం చేసుకోన8న్నారు. ఇప్పటికే అక్కినేని వారి ఇంట పెళ్లి పనులు మొదలైపోయాయి. ఈ క్రమంలోనే వీరికి సంబంధించిన ఎన్నో పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.
ఇక వీరి పెళ్ళి హిందు సంప్తదాయ ప్రకారం ఎంతో గొప్పగా జరగనుందట. అయితే ఈ వేడుకను కేవలం 300 మంది బంధు మిత్రుల సమక్షంలో సింపుల్‌గా చేయనున్నారు. ఈ విషయాని నాగార్జున స్వయంగా వెల్లడించాడు. ఇక అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీళ పెళ్ళి జరిగాతే నాన్న గారి ఆశిసులు కూడా వారిపై ఉంటాయని అందుకే అక్కడే చై – శోభితల వివాహం చేయనున్నట్లు వివరించాడు. ఇలాంటి క్రమంలోనే చైతన్య, శోభితల మధ్యన ఉన్న ఏజ్ గ్యాప్ గురించి డిస్కషన్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య 1986 నవంబర్ 26లో జన్మించారు. అతని వయసు ప్రస్తుతం 38 ఏళ్లు. ఇక శోభిత 1992 మే 31న జన్మించింది. ఆమె ఏజ్ 32 ఏళ్ళు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్యన ఏకంగా ఆరేళ్ల ఏజ్ గ్యాప్ ఉందంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ విషయం తెలిసిన అభిమానులతో పాటు.. నెటిజన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు ఇది సరైన ఏజ్ గ్యాపే. పెళ్లి చేసుకునే వధూ, వరులకు ఈ మాత్రం ఏజ్ గ్యాప్ ఉంటే అందులో పెద్ద ఆశ్చర్య పోవాల్సిన అవసరమే ఉండదు అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.