చరణ్ ” గేమ్ ఛేంజర్ ” లో పవన్ బ్లాక్ బస్టర్ సాంగ్.. ఇక బాక్సాఫీస్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..

మెగాస్టార్ త‌న‌యుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. గ్లోబల్ స్టార్ రేంజ్‌కు ఎదిగిన రామ్ చరణ్‌కు పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచ‌యం అవసరం లేదు. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న చరణ్.. అదే ఊపుతో శంకర్ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజర్ సినిమాలో నటించాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతుంది. ఈ క్ర‌మంలోనే రామ్‌చరణ్.. గేమ్ ఛేంజ‌ర్‌పై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు చూస్తామా.. అంటూ మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Game Changer (2025) - IMDb

ఇక ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయాలని మేకర్స్ కూడా గట్టి ప్లాన్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ నెటింట‌ తెగ వైరల్‌గా మారుతుంది. ఇటీవల ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. టీజర్‌కు ప్రేక్షకుల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. అన్ని భాషల్లో ప్రేక్షకులు దీనికోసం ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నారో క్లారిటీ వచ్చేసింది. కాగా ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏవో ఒక కొత్త విషయాలు మేకర్స్ అప్డేట్ చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా తాజాగా మరో వార్త వైరల్ అవుతుంది.

Second single from Ram Charan's Gamechanger to come gets a release window

ఈనెల 20వ తారీకున ఈ సినిమాకు సంబంధించిన మూడో లిరికల్ సాంగ్ రిలీజ్ చేయనున్నారని.. ఈ సాంగ్ కోసం దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్ను మేకర్స్ ఖర్చు చేసినట్లు టాక్‌. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ సర్ప్రైజ్ తాజాగా వైరల్ గా మారుతుంది. అఫీషియల్ గా మేకర్స్ ప్రకటించకపోయిన.. ఓ సీక్రెట్ తెగ ట్రెండింగ్‌గా మారింది. అదేంటో కాదు ఈ సినిమాలో ఓ సన్నివేశంలో చరణ్, పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ పాటకు.. డ్యాన్స్ స్టెప్పులు ఇరగదీస్తాడట. ఈ డ్యాన్స్ అభిమానులకు పూనకాలు తెప్పించే రేంజ్ లో ఉంటుందని టాక్. ఇక చరణ్ సినిమాలో పవన్ సాంగ్ అంటేనే మెగా అభిమానుల్లో పూన‌కాలు మొదలైపోతాయి.. అలాంటిది పవన్ సాంగ్కు చరణ్ చిందులు వేయడం అంటే ఏ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.