ప్రభాస్ ‘ స్పిరిట్ ‘ నయా లుక్ వైరల్.. కానీ ట్విస్ట్ ఏంటంటే..?

టాలీవుడ్ నెంబర్ వ‌న్ స్టార్ హీరో.. పాన్ ఇండియ‌న్‌ రెబల్ స్టార్ ప్రభాస్.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో రూపొందునున్న పాన్ ఇండియన్ మూవీ స్పిరిట్. భూషణ్ కుమార్ ప్రొడ్యూసర్‌గా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల‌లో బిజీగా ఉన్న ఈ సినిమా డిసెంబర్ నెలలో సెట్స్‌పైకి రానుంద‌ట‌. దీంతో ప్రభాస్ ఓ శక్తివంతమైన పోలీస్ పాత్రలో కనువిందు చేయనున్న సంగతి తెలిసిందే.

Is Sandeep Reddy Vanga's new haircut a hint at Prabhas' character in 'Spirit'?  - KNOW HOW

దీనికి సంబంధించిన లుక్స్ కూడా ఇప్పటికే ఫిక్స్ అయిపోయినట్లు టాక్ నడుస్తుంది. అయితే తాజాగా ప్రభాస్ న‌యా లుక్ వైర‌ల్‌గా మారుతుంద‌ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక్కడ అస‌లు ట్విస్ట్ ఏంటంటే ప్రభాస్ ఈ సినిమాలో ఒక పోలీస్ గెటప్ లోనే కాదు.. సందీప్ రెడ్డివంగా గత చిత్రం యానిమల్ లోని రణబీర్ పాత్ర తరహాలు మరో రెండు కొత్త లుక్స్ లో కూడా ఆయన మెరువనున్నాడట. వచ్చే నెలలో ఈ సినిమాను గ్రాండ్ లెవెల్‌లో ప్రారంభించి జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతారని సమాచారం.

Spirit - IMDb

అక్కడి నుంచి ఆరు నెలల్లో సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేస్తారని మూవీ ప్రొడ్యూసర్ ఇటీవల వెల్లడించారు. దీన్ని బట్టి వచ్చేయడాదిలోనే ఆడియన్స్ను స్పిరిట్ పలకరించే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వరం మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు. ప్రభాస్ నుంచి ఓ సినిమా వస్తుందంటే ఆడియన్స్ లో మొదటి నుంచే మంచి అంచనాలు ఉంటాయి. దానికి తగ్గట్టు సందీప్ రెడ్డి లాంటి డైనమిక్ డైరెక్టర్ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ క్రమంలో స్పిరిట్‌ సినిమాపై ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలను నెలకొన్నాయి. ఇక ఈ సినిమా సెట్స్‌ పైకి వచ్చి.. షూట్లో పూర్తి చేసుకున్న తర్వాత.. రిలీజై ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.