మరోసారి పుష్పరాజ్ విధ్వంసం.. యూఎస్ఏ బాక్స్ ఆఫీస్ దగ్గర ” పుష్ప 2 ” ప్రీ సెల్ రికార్డ్..

ఇక పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో పుష్ప 2 సినిమాపై ఆడియన్స్ లో మరిన్ని అంచనాలు పెరిగాయి. మరింత యాక్షన్, గ్రిప్పింగ్ స్టోరీ కోసం ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక గతంలో అల్లు అర్జున్ పుష్పలో త‌న నటనకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డున అందుకున్న సంగతి తెలిసిందే. మొట్టమొదటి జాతీయ అవార్డు అందుకున్న తెలుగు నటుడిగా రికార్డ్ కూడా సృష్టించాడు. ఈ గుర్తింపు బన్నీ స్టార్‌డంను పెంచడమే కాదు.. పుష్ప రోల్ పట్ల తన డెడికేషన్ రిప్రెజెంట్ చేసింది. ఇక పుష్ప 2 ది రూల్‌తో ఎర్రచందనం స్మగ్లింగ్, తీవ్రమైన అండర్ వ‌రల్డ్‌ పుష్పరాజ్ ప్రయాణం ఎలా ఉంటుందో చూడడానికి ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు.

Pushpa 2 Allu Arjun to Rashmika Mandanna know who got highest fee for film  | Pushpa 2 के लिए मेकर्स ने भर दी Allu Arjun की तिजोरी, जानिए बाकी स्टार्स  को कितनी मिली फीस

పార్ట్ 1లో పుష్ప, విల‌న్ భ‌న్వ‌ర్‌సింగ్ షేకావ‌త్‌ పాత్రల మధ్యన జరిగిన పొట్టి.. ఆడియ‌న్స్‌ను ఆద్యాంతం మాకట్టుకుంది ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వారు.. పుష్ప 2 కోసం మరింతగా ప్రేక్షకులను ఆకట్టుకునే అనుభూతిని సృష్టించడానికి భారీ లెవెల్లో ప్లాన్ చేశారట. దీంతో పాటు.. హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంతో సహా.. బహుభాషలో సినిమా రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. భారీ ప్రమోషన్స్‌ను కూడా ప్లాన్ చేసిన టీం.. యూఎస్ఏ ప్రీమియర్స్ డిసెంబర్ 4న ప్రదర్శించనున్నారు.

USA బాక్సాఫీస్ వద్ద  కొత్త ప్రీ-సేల్ రికార్డును నెలకొల్పిన 'పుష్ప 2'

ఈ క్రమంలోనే తాజాగా మూవీ సినిమా ఫ్రీ సేల్స్ లో బన్నీ సృష్టించిన రికార్డును పోస్టర్ రూపంలో రియల్ చేశారు. తాజాగా ఫ్రీ సేల్స్ లో పుష్ప 2 వన్ మిలియన్ డాలర్ మార్క్‌ చేరుకున్నట్లు వెల్లడించారు. భారతదేశంలో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి చిత్రంగా పుష్పా నిలిచింది. ఈ విషయాన్ని తెలియజేయడానికి మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్‌ను డిజైన్ చేసి వదిలారు. ఇందులో పాహ‌ద్ ఫ‌జిల్, అనసూయ, ధనుంజయ, రావు రమేష్ , జగదీష్, ప్రదీప్ బండారి తదితరులు కీలకపాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇక సినిమాకు డిఎస్పీ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తుండగా.. మరో వెర్షన్ కోసం థ‌మన్, అజినీష్, శ్యామ్ లు కూడా పనిచేస్తున్నట్లు సమాచారం.