చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇప్పుడు హీరోలు హీరోయిన్లుగా నటిస్తున్న వారు టాలీవుడ్ లో ఎంతో మంది ఉన్నారు. వారిలో కావ్య కళ్యాణ్ రామ్ కూడా ఒకటి. ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. 2003లో వచ్చిన గంగోత్రి లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట అనే సాంగ్‌తో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర అయింది. గంగోత్రి తర్వాత కావ్య కళ్యాణ్ రామ్ చదువుపై దృష్టి సారించడంతో అడపా దడపా సినిమాల్లో మాత్రమే మెరిసింది. చైల్డ్ ఆర్టిసిగా తన క్యూట్ నటనతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. స్నేహమంటే ఇదేరా, ఠాగూర్, అడవి రాముడు, విజయేంద్ర వర్మ, బాలు, బన్నీ, సుభాష్ చంద్రబోస్, పాండురంగడు ఇలా ఎన్నో సినిమాల్లో ఆకట్టుకుంది.
ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా మారి పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది. 2022లో సాయికిరణ్ డైరెక్షన్లో రూపొందిన మసుదా.. హారర్ మూవీలో హీరోయిన్గా కనిపించిన కావ్య.. ఆడియన్స్‌ను సినిమాలో తన నటనతో కట్టిపడేసింది. తర్వాత 2023లో బలగం సినిమాలో హీరోయిన్గా నటించిన మెప్పించింది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవడంతో ఒక్కసారిగా అమ్మడి క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఇక చివరిగా కావ్య.. మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి తనయుడు శ్రీ సింహతో ఉస్తాద్ సినిమాలో నటించింది.
అయితే ఈ సినిమా ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేదు. ప్రస్తుతం కావ్య కొత్త సినిమాలని ప్రకటించలేదు. కానీ.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తూనే ఉంటుంది. ఇదిలా ఉంటే గతంలో కావ్య చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారుతున్నాయి. తన ఫేవరెట్ సెలబ్రిటీ ఎవరు అనే ప్రశ్నకు.. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య అంటే.. నాకు ఎంతో ఇష్టం అంటూ వివరించింది. అంతేకాదు నాగ చైతన్యతో కలిసి నటించే అవకాశం వస్తే అది ఎలాంటి రోల్ అయిన క్షణం కూడా ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తా. రెక్కలు కట్టుకొని సెట్స్ లో వాలిపోతా అంటూ.. కామెంట్స్ చేసింది. ప్రస్తుతం కావ్య చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.