టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న షో అష్టోపబుల్.. ఇప్పటికే మూడు సీజన్‌లు సక్సెస్ఫుల్గా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ షో నాలుగో సీజన్ కూడా మంచి ఫామ్ లో దూసుకుపోతుంది బాలయ్య బాబు హోస్టుగా వ్యవహరిస్తున్న ఈ షోకి.. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రావడమే కాదు.. ఎంతోమంది సెలబ్రిటీస్ తమ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకోవడానికి ఇది మంచి వేదికగా మారింది. ఇక ప్రస్తుతం నడుస్తున్న నాలుగో సీజన్లో ఇప్పటివరకు సీఎం చంద్రబాబు, సూర్య, అల్లు అర్జున్ లాంటి వాళ్ళు వచ్చి సందడి చేశారు. అయితే ఇప్పటివరకు జరిగిన నాలుగు సీజన్లలో ఎన్టీఆర్ ని ఒక్కసారి కూడా బాలయ్య పిలవలేదు. ప్రస్తుతం నడుస్తున్న నాలుగో సీజన్ లో కూడా ఎన్టీఆర్ వస్తాడా లేదా అనేది సందేహమే.
ఇక ఈ సీజన్లో మరికొన్ని ఎపిసోడ్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. వాటిలో ఎన్టీఆర్ రావడం అనేది అసాధ్యం అంటూ అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరు నందమూరి వంశస్థులే అయినా.. వారి మధ్య కుటుంబ సమస్యలు ఉండడమేనని.. రాజకీయ వైరుధ్యాలు కూడా ఉన్నాయంటూ దీని కారణంగానే తారక్ ఈ షోకు రావడం అసాధ్యం అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక పరిస్థితులు కూడా ఎప్పటికప్పుడు ఈ వార్తలకు తగ్గట్లుగానే వస్తుండడంతో.. ఈ వార్తలు నిజమేనంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే తెలుగులో ఇప్పుడు అలాంటిదే మరో టాక్ షో వస్తున్న సంగతి తెలిసిందే.
ఈ షో కి రానా హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. దీంతో కనీసం రానా వ్యవహరిస్తున్న ఈ షోలో అయినా ఎన్టీఆర్ను పిలుస్తారా.. లేదా.. అనే ఆసక్తి అభిమానులను నెలకొంది. ఒకవేళ రానా పిలిచిన ఎన్టీఆర్ వస్తాడా.. లేదా.. అనే సందేహం కూడా ఉంది. ఎన్టీఆర్ కాదు చిరు, నాగార్జునలాంటి వాళ్ళు కూడా ఇప్పటివరకు బాలయ్య షోలో కనిపించిందే లేదు. ఈ క్రమంలోనే ఈ సెలబ్రిటీస్ అంతా రానా షోలో కనిపిస్తారా లేదా అనే ప్రశ్నకు రానా రియాక్ట్ అయ్యారు. నా ఇంటర్వ్యూలో ఎవరి పేర్లు ఎక్కువగా వినిపిస్తాయో వాళ్లు నా షో కి వస్తారని.. వాళ్ళని నేను పిలిచే ఆలోచనలో ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు. కాకపోతే కొన్ని లిమిటెడ్ ఎపిసోడ్స్ మాత్రమే వస్తాయని.. సీజన్ వన్ హిట్ అయితే సీజన్ 2 కి మరింత మంది సెలబ్రెటీస్ ని పిలవనున్నానని రానా చెప్పుకొచ్చారు.