సౌత్ సినీ ఇండస్ట్రీలో తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రిలీజై బ్లాక్ బస్టర్లుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే బాహుబలి నుంచి పుష్ప సినిమా వరకు మొత్తం సౌత్ సినిమాల సక్సెస్ కు కారణం ఓ స్టార్ హీరోయిన్ బర్తే అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా త్వరలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే నవంబర్ 17న ట్రైలర్ గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేశారు మేకర్స్. బీహార్, పాట్నా వేదికగా గ్రాండ్ లెవెల్ లో జరిగిన ఈ వేడుకల్లో హీరోయిన్ రవీనా టాండన్ భర్త అనిల్ తడాని కూడా సందడి చేశారు.
అసలు పుష్ప 2కి అనిల్ తడానికి ఉన్న సంబంధమేంటని ఆశ్చర్యపోతున్నారు కదా.. అయితే సౌత్ లోని ఎన్నో పాన్ ఇండియన్ సినిమాలు బాలీవుడ్ లో బ్లాక్ బాస్టర్లుగా మారడానికి అనిల్ తడానినే కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం ఆ సినిమాలన్నింటి సక్సెస్‌లో కీలకపాత్ర ప్లే చేశాడు. అసలు ఆయనకు, ఆ సినిమాలకు సంబంధమేంటి.. అనుకుంటున్నారా. అనిల్ తడాన్ని ఇప్పటివరకు టాలీవుడ్ నుంచి రిలీజ్ అయిన పుష్ప ది రైస్, బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్‌క్లూజన్, కేజిఎఫ్, కేజిఎఫ్ 2, కల్కి 2898 ఏడి ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల సక్సెస్ కు కీలక పాత్ర పోషించాడు. బాలీవుడ్‌లో ది మోస్ట్ ఫేమస్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్‌గా అనిల్ తడానికి మంచి పేరు ఉంది.
అతని సంస్థ ఏఏ ద్వారా.. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర ప్రాంతాల్లో ఇండియన్ మార్కెట్ సినిమాలను పంపిణీ చేస్తూ ఉంటారు. 1994లో రిలీజ్ అయిన ఏ దిల్గీతో తడాని తన కెరీర్‌ను మొదలు పెట్టాడు. 2017 నుండి సౌత్ సినిమాలన్నిటితో పాటు హిందీ డబ్బింగ్ వర్షన్‌ను కూడా పంపిణీ చేయడం ప్రారంభించారు. మొదట సౌత్ సినిమాగా ఎస్.ఎస్.రాజమౌళి.. బాహుబలి ది బిగినింగ్ పంపిణీ చేయగా.. పాన్ ఇండియా లెవెల్ లో భారీ వసూళ్లు రాబట్టింది. అప్పటినుంచి అనిల్ తడాని సౌత్లో విజయవంతమైన సినిమాలను తీసుకుంటూ భారీ లాభాలు దక్కించుకుంటూనే ఉన్నాడు. ఇక రవినా, అనిల్ తడానికి 2004లో ఉదయపూర్ లో గ్రాండ్ లెవెల్లో వివాహం జరిగింది. వీరికి పెళ్లి 20 ఏళ్ల అయింది. అంతేకాదు రాషా తడాన్ని, రణబీర్ వర్ధన్ ఇద్దరు పిల్లలు కూడా వీరికి ఉన్నారు. కూతురు రాషా త్వరలో ఆజాద్ మూవీ తో హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది.