బన్నీ vs జక్కన్న పై చేయి ఎవరిది పుష్ప 2 రిజల్ట్ తో తేలనుందా..?

సౌత్ టు నార్త్.. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులకు సుపరిచితమైన డైరెక్టర్ ఎవరంటే టక్కున గుర్తుకొచ్చేది రాజమౌళి పేరే. రాజమౌళి డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఎన్నో సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బాహుబలి సిరీస్‌, ఆర్‌ఆర్ఆర్ సినిమాలతో రాజమౌళి ఒక్కసారిగా బాక్స్ ఆఫీస్ దగ్గర తిరుగులేని ఖ్యాతిని సంపాదించారు. అంతేకాదు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల‌కు కూడా రాజమౌళి సినిమాల ద్వారానే పాన్ ఇండియా ఇమేజ్ దక్కింది. అయితే అల్లు అర్జున్ మాత్రం అసలు జక్కన్న సపోర్ట్ లేకుండా పాన్ ఇండియా లెవెల్ లో ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు.

SS Rajamouli Biography: Birth, Age, Family, Career, Movies, Net Worth &  More!

పుష్ప ది రైజ్‌ మూవీ అసలు ఎవరు ఊహించని రేంజ్ లో సక్సెస్ అందుకోవడంతో పుష్పాది రూల్స్ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే రాజమౌళి సినిమాల అన్నిటి ఫస్టే కలెక్షన్లను బ్రేక్ చేస్తూ పుష్ప 2 రికార్డు క్రియేట్ చేస్తుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక బన్నీ – జక్కన్న లో ఎవరిది పై చేయి అన్నది పుష్ప 2 రిజల్ట్‌తో తెలిపోనుంద‌ట‌. ఒకప్పుడు క్లాస్ సినిమాలతో తప్పటడుగులు వేసిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. ఇప్పుడు ఊరమాస్‌ సినిమాలను తనదైన స్టైల్‌లో రూపొందిస్తూ ఎంతో మంది ప్రశంసలు అందుకుంటున్నాడు. సుకుమార్ సక్సెస్ రేట్ గత కొన్నేళ్లుగా ఊహించని రేంజ్‌లో పెరిగిపోయింది.

Pushpa 2: Allu Arjun wants his sequel to be bigger than SS Rajamouli's RRR?

ఈ క్రమంలోనే గత పదేళ్ళుగా సుకుమార్ క్రేజ్‌ ఏమాత్రం తగ్గకుండా రోజురోజుకు మరింతగా పెంచుకుంటున్నారు. తన టాలెంట్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే పుష్ప 2.. ఈజీగా రూ.2000 కోట్ల కలెక్షన్లు సాధించేస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పుష్ప 2 ఫైనల్ రేంజ్ తెలియాలంటే మాత్రం.. ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇక ఏదేమైనా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో కూడా ఓ పాన్ ఇండియా లెవెల్ సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ కాంబినేషన్ సాధ్యమవుతుందో లేదో చూడాలి. ఒకవేళ వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించడం ఖాయం అనడంలో అతిశయోక్తి లేదు.