ఎఫైర్లపై పూర్తిస్థాయిలో రియాక్ట్ అయిన నయన్.. ఒక్కొక్కడికి ఇచ్చి పడేసిందిగా..

తాజాగా సౌత్ స్టార్ బ్యూటీ నయనతార డాక్యుమెంటరీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది రిలీజ్ కాకముందు అందరిలోనూ ఒకే సందేహం ఉండేది. ఆమె త‌న ఎఫైర్‌ల‌ గురించి కూడా ఇందులో మాట్లాడుతుందా.. ఆ టాపిక్ టచ్ చేయకుండా మిగతాది కవర్ చేస్తారా.. అని అందరిలోనూ ప్రశ్నలు మొదలయ్యాయి. కానీ.. నయన్ మాత్రం తన పాత రిలేషన్ షిప్స్ పై కూడా సవివరంగా దీనిలో పూర్తిస్థాయిలో రియాక్ట్ అయింది. సింబు, ప్రభుదేవ లాంటి పేర్లు బయట పెట్టకుండా.. ప్రతి డేటింగ్ పై తన వర్షన్ వెల్లడించింది.

Simbu-Nayanthara intense fight ?

కెరీర్ ప్రారంభంలో శింబుతో ప్రేమలో పడిన నయన్.. అది బ్రేకప్ అయిందని.. దానికి తన కారణాన్ని క్లియర్ గా వెల్లడించింది. ప్రేమలో ప్రతిదీ నమ్మేస్తాం. ప్రేమకు పునాది నమ్మకం. నేను కూడా అలాంటి నమ్మకాన్ని పెట్టుకున్న. కానీ.. ఎదుటి వ్యక్తి నా నమ్మకాన్ని వమ్ము చేశాడని.. నిజానికి అతను నన్ను ప్రేమించలేదని వివరించింది. ఇక అప్పట్లోనే సింబు, న‌య‌న్ లిప్ కిస్ పిక్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ప్రభుదేవతో ఎఫైర్ గురించి కూడా నయనతార రియాక్ట్ అయింది. కెరీర్ పరంగా లైఫ్ పరంగా చాలా కీలకమైన పేజీలు ఉంటాయని.. ఆ టైంలో కెరీర్ వదులుకోవాలని సినిమాలు మానేస్తే పెళ్లి అనే కండిషన్ పెడితే.. లైఫ్ సెటిల్ అవుతుందని నమ్మకంతో తాను సినిమాలను మానేయాలని డిసైడ్ అయినట్లు వెల్లడిచ్చింది.

Pics Nayanthara, Vignesh Shivan celebrate Tamil New Year Vishu with sons -  India Today

అయితే ఆ టైంలో శ్రీరామరాజ్యమే తన చివరి సినిమా అని నయన్‌ అనుకుందట. అందరికీ అదే విషయం చెప్పానని.. కానీ ఆ తర్వాత తన జీవితంలో పరిస్థితులు తలకిందులు అయ్యాయి అంటూ వివరించింది. ఎవరి వల్ల నేను మోసపోయానో ఆ వ్యక్తి ముందే ఎదగాలని.. ప్రతిరోజు ఆ వ్యక్తి నన్ను చూసి ఈర్ష పడేలా చేయాలని.. ఆ క్షణమే నిర్ణయించుకున్న. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టా అంటూ నయన్‌ వివరించింది. ఇక విగ్నేష్ శివ‌న్‌ తో ఆమెకు ఎలా ప్రేమ మొదలైంది.. పెళ్లి, పిల్లలు లాంటి విషయాలు కూడా ఈ డాక్యుమెంటరీ లో క్లియర్ గా వివరించింది.