టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కనున్న పుష్ప 2 రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాపై మరింత హైప్ పెరిగింది. ట్రైలర్లో అంచనాలను పిక్స్ లెవెల్ కు తీసుకెళ్లిన మేకర్స్.. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్‌తో ఆడియన్స్‌ను మరింత ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే సినిమాలో సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి.. ముఖ్యంగా ఐటెం గీతం ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందనే.. దానిపై ఫాన్స్ లో ఆసక్తి నెలకొంది. మరోవైపు బ్యాగ్రౌండ్ స్కోర్ పనులు కూడా ఆల్మోస్ట్ పూర్తయిపోయాయట. ఫస్ట్ హాఫ్ మ్యూజిక్ పనులు థమన్ పూర్తి చేయగా.. ఇప్పుడు సెకండ్ హాఫ్ అజినేష్ లోక్నాథ్, శ్యామ్ సి.యస్ పంచుకోనున్నారని తెలుస్తోంది.
అయితే ఇప్పటికే డిఎస్పి తనవంతు వెర్షన్ పూర్తి చేసేసాడట. సినిమా మొత్తానికి ఆయన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించేసాడని తెలుస్తుంది. అది ఓ వర్షన్ కాగా.. థమన్, అజనీష్, శ్యామ్ ఇచ్చిన మ్యూజిక్ మరో వర్షన్ అని తెలుస్తుంది. అలా ఇప్పుడు పుష్ప సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం.. రెండు వర్షన్లు సిద్ధమయ్యయట. వీటిలో ఏది ఫైనల్ అవుతుందో సుకుమార్ చేతుల్లోనే ఉందని.. నిజానికి మొదట బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం మరో ముగ్గురు సంగీత దర్శకులను తీసుకోవడానికి సుక్కు ఆసక్తి చూపలేదట. కేవలం నిర్మాతల ఒత్తిడి కారణంగానే సుకుమార్ థమన్, శ్యామ్, అజినిష్‌ను తీసుకోవాల్సి వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పుష్ప 2లో డిఎస్పీ విషయంలో పుష్పా టీంకు ఏదైనా చేడిందా అనేది సందేహలు వినిపిస్తున్నాయి.
ఏదేమైన సుకుమార్ కు మాత్రం డీఎస్పీ మ్యూజిక్ పైనే మక్కువ ఉందని.. ఈ రెండు వర్షన్‌ల్లో మ్యూజిక్లను పరిశీలించిన తర్వాత డిఎస్పి బ్యాగ్రౌండ్ సెలెక్ట్ చేసిన ఆశ్చర్యం లేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ట్రైలర్ కు కూడా మ్యూజిక్ కోసం మూడు వర్షన్‌లు చేయించారట. ఓ వర్షన్స్ కి దేవిశ్రీప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కొర్ ఇస్తే.. మరో వర్షన్ కు థమన్, ఇంకో దానికి శ్యమ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారట. చివరికి ట్రైలర్లో డిఎస్పి మ్యూజిక్ వెర్షన్ రిలీజ్ చేశారు. రేపు సినిమా విషయంలోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందని డిఎస్పి ఫ్యాన్స్ భావిస్తున్నారు. అంతేకాదు దేవిశ్రీప్రసాద్ పై సుకుమార్కి మొదటి నుంచి చాలా ఇష్టం ఉంది. ఈ క్రమంలోనే ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలోనే దేవి పై సుక్కుకి ఉన్న ప్రేమ బయటపడుతుందంటూ అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. చివరకు సినిమా అంతా పూర్తయిన తర్వాత ఎవరి మ్యూజిక్ వెర్షన్ ఫైనల్ అవుతుందో వేచి చూడాలి.