టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న తాజా మూవీ పుష్ప 2. టాలీవుడ్ ప్రెస్టీజియస్ మోస్ట్ ఎవైటెడ్ మూవీగా ఈ సినిమా డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్‌కు గ్రాండ్ లెవెల్లో సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానంలో విపరీతమైన అంచనాల నెలకొన్నాయి. పుష్ప గాడి ఊచకోత చూడాలని అభిమానులను కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
అయితే అంచనాలకు తగ్గట్టు సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేలా మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చెప్తున్నారని సమాచారం. ఇక ఇండియన్ వైడ్‌గా టికెట్ రేట్ల విషయంలో కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారట. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా టికెట్ ధరలు పెంచేఅవకాశలు ఉన్నాయి. ఇక తెలంగాణలో ఎలాగూ టికెట్ రేట్లు పెంపుకు అనుమతులు వచ్చేస్తాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో సినిమా కోసం ఎంత మేరకు టికెట్ రేట్ల పెంపు ఉంటుందనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఏపీలో సింగిల్ స్క్రీన్ టికెట్ ధరలు ఎప్పుడు రూ.150 నుంచి రూ.200 మధ్యలో ఉంటాయి.
అయితే ప్రస్తుతం పుష్ప 2 రిలీజ్‌కు ఈ టికెట్ రేట్లను మరి కాస్త పెంచి.. ఒక్కో టికెట్ కు రూ. 300గా చేయాలని నిర్మాతలు ఏపీ ప్రభుత్వాన్ని కోరనున్నారట. ఎలాగూ బెనిఫిట్స్ లో, ఎక్స్ట్రా షోలకు అనుమతి వచ్చేస్తుంది. అందులో సందేహం లేదు. ఇప్పుడు టికెట్ల రేట్లు పెంపకం ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతి వస్తుందా.. లేదా.. అనేది ఆసక్తిగా మారింది. అయితే నిజంగానే ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లకు కూడా అనుమతి ఇస్తే. ఇది నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు చాలా పెద్ద గుడ్ న్యూస్ అవుతుంది. మరి పుష్ప 2 విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.