బాలయ్య – రజిని కాంబోలో ఓ మిస్ అయిన మల్టీస్టారర్ ఇదే..

సౌత్ సినీ ఇండస్ట్రీలో తెలుగులోనే స్టార్ హీరోలుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సీనియర్ నటులలో నందమూరి నట‌సింహం బాలకృష్ణ, సూపర్ స్టార్ రజినీకాంత్ మొదటి వరుసలో ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇప్పటికి యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇస్తూ తమ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న ఇద్దరు హీరోస్.. వాళ్ళ సినిమాలతో మంచి సక్సెస్ లు అందుకుంటు రాణిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో బాలయ్య హ్యాట్రిక్ మిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. అటు కోలీవుడ్లో రజనీకాంత్ కూడా మంచి స‌క్స‌స్ అందుకుంటున్నాడు. అయితే ఇలాంటి ఇద్దరు స్టార్ హీరోల కాంబోలో ఓ సినిమా మిస్ అయిందని చాలామందికి తెలిసి ఉండదు.

Kathanayakudu (2008) - Plex

ఒక కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఈ కాంబోలో సినిమా తీయాలని భావించాడట. దీనికి అంతా ఓకే అనుకున్న తర్వాత.. చివరి నిమిషంలో ఈ కాంబినేష‌న్‌ క్యాన్సిల్ అయిందని టాక్. ఇంతకీ ఆ సినిమా ఏంటి.. అసలు సినిమా క్యాన్సిల్ అవడానికి కారణాలేంటి ఒకసారి చూద్దాం.. గతంలో రజనీకాంత్ హీరోగా కథానాయకుడు మూవీ వ‌చ్చి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కె. ఎస్. రవికృష్ణ దర్శకుడిగా వ్యవహరించాడు. ఇక ఈ సినిమాలో రజనీకాంత్ స్నేహితుడు పాత్రకు మొదటగా బాలకృష్ణను భావించారట. బాలకృష్ణ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

Rajinikanth celebrates 'lovely brother' Nandamuri Balakrishna completing 50  years in cinema - Hindustan Times

కానీ.. తర్వాత రజనీకాంత్ బాలకృష్ణ కు కాల్ చేసి మీరు నా సినిమాల్లో నా ఫ్రెండ్ రోల్ చేయడానికి ఒప్పుకున్నారట.. చాలా సంతోషం. కానీ.. ఇది సినిమాలోనే చాలా చిన్న పాత్ర ఇలాంటి పాత్రలో నటిస్తే మీ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. కచ్చితంగా ఇది మీ స్థాయికి, మీ ఇమేజ్ కు తగిన పాత్ర కాదని నాకు అనిపిస్తుంది.. దీని వల్ల సినిమాకు కూడా నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది ఒకసారి ఆలోచించుకోమని బాలయ్యకు వివరించాడట. ఇది విన్న బాలయ్య కాస్త ఆలోచించి మీ నిర్ణయం సరైనదేనని సినిమాను వదులుకున్నాడట. అలా బాలయ్య, రజినీకాంత్ కాంబోలో రావల్సిన ఓ బ్లాక్ బస్టర్ మిస్ అయిందట‌.