టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరగా కొరటాల శివ డైరెక్షన్లో తరికెక్కిన దేవర బ్లాక్ బస్టర్ సక్సెస్ తో మంచి ఫామ్ లో ఉన్న ఎన్టీఆర్.. వరస లైన్‌అప్‌తో బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం వార్ 2 షెడ్యూల్స్ లో పాల్గొంటున్న తారక్.. సినిమాను ఈ ఏడాది పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్‌లో అడుగుపెట్టనున్నాడు. ఇలాంటి నేపథ్యంలో ఎన్టీఆర్‌తో నటించే అవకాశం వస్తే బాగుంటుందని.. ఎంతోమంది పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్స్ సైతం ఆరాటపడుతున్నారు.
అలాంటిది ఎన్టీఆర్ తో నటించే ఛాన్స్ వచ్చినా ఓ బాలీవుడ్ హీరోయిన్ అవకాశాన్ని మూడుసార్లు రిజెక్ట్ చేసిందట. ఇంతకీ ఆమె ఎవరో.. అసలు సినిమాలకు నో చెప్పడానికి కారణాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఇప్పటికే దేవరతో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్‌కు ఎన్టీఆర్ లైఫ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆఫర్ కోసం మొదట ఎంతో మంది హీరోయిన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తుంటే.. ఆ బాలీవుడ్ బ్యూటీ మాత్రం కథను సింపుల్గా రిజెక్ట్ చేసిందట. అది కూడా ఒక్కటికి మూడుసార్లు ఎన్టీఆర్ సినిమాలు నటించినని చెప్పేసిందట. ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ బాలీవుడ్ బ్యూటీ ఎవరో కాదు.. ఆలియాభట్. కొన్ని సందర్భాల్లో సెకండ్ హీరోయిన్గా అవకాశా రావడం.. మరి మరికొన్ని సార్తు కథ నచ్చకపోవడంతో ఆ సినిమాలను రిజెక్ట్ చేసిందట.
అలియాభట్ గతంలో ఎన్టీఆర్ నటించిన హిట్ సినిమాలను కూడా ఇదే విధంగా రిజెక్ట్ చేసింది. కానీ.. ఎన్టీఆర్ మాత్రం తన ఫేవరెట్ హీరోయిన్ అలియా భట్ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అలాగే త్రిబుల్ ఆర్ ప్రమోషన్ లో ఆలియా కూడా ఎన్టీఆర్‌తో తనకు ఫుల్ లెన్త్ సినిమా చేయాలని ఉందంటూ.. కథ నచ్చక కొన్నిసార్లు చేయలేకపోయా అంటూ చెప్పుకొచ్చింది. అయితే రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ పక్కన ఆలియా హీరోయిన్ గా నటిస్తుందమో వేచి చూడాలి. కాగా ప్రస్తుతం ఆలియ.. ఎన్టీఆర్‌ను మూడు సార్లు రిజెక్ట్ చేసింది అన్న న్యూస్ వైరల్ అవ్వడంతో.. ఫుల్ లెన్త్ పాత్ర లేదన్న కారణంతో ఎన్టీఆర్ సినిమాను రిజెక్ట్ చేసావా.. ఇలాంటి సిల్లీ కారణాలకు తారక్ తో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్నావా అంటూ ఫైర్ అవుతున్నారు తారక్ ఫ్యాన్స్.