టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని మొదట ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ప్రస్తుతం స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో మొదట క్లాప్ బాయ్ గా అడుగుపెట్టిన నాని అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించాడు. ఈ క్రమంలోనే డైరెక్టర్ కంటపడి నటుడు అవకాశాన్ని కొట్టేశాడు. అల్ల చిన్న సినిమాల్లో నటిస్తూనే తన న్యాచురల్ నటనతో పక్కింటి కుర్రాడిలా నటించి ఆకట్టుకున్నాడు. అలా నాచురల్ స్టార్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని వరుస ప్రాజెక్టులతో బిజీ అయ్యాడు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోగా తన ఇమేజ్ను చాటుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో నానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. నాని తన సినీ కెరీర్‌లో తనతో కలిసి నటించిన ఓ హీరోయిన్ ని ఘాడంగా ప్రేమించాడట.
ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్న తర్వాత ఆమెతో బ్రేకప్ కావడంతో అంజనను ప్రేమించిపెళ్లి చేసుకున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో.. అసలు వారిద్దరు విడిపోవడానికి కారణం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. నాని తన కెరీర్ లో ఎంతోమంది హీరోయిన్ తో కలిసి ఆడి పాడిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఎంతమందితో నటించినా పర్ఫెక్ట్ జోడి అనే ఇమేజ్ క్రియేట్ అయింది మాత్రం నిత్యమీనన్ తోనే. నాని హీరోగా నటించిన ఆలా మొదలైంది సినిమాతోనే నిత్యమీనన్ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో అమ్మడి నటనకు విమర్శకుల నుండి కూడా ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాల్లో వీళ్ళ కెమిస్ట్రీ కూడా అద్భుతంగా పండింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని.. తర్వాత వీరి కాంబోలో వచ్చిన సెగ షూట్ టైంలో అది మరింత బలపడటంతో ఇద్దరు వివాహం కూడా చేసుకోవాలని భావించారట.
అలా నాని – నిత్యమీనన్ ని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వచ్చిన ప్రచారానికి సడన్గా చెక్ పెడుతూ అంజనాని వివాహం చేసుకున్నాడు నాని. కాగా అంజనను కూడా ఎప్పటినుంచో నాని ప్రేమించాడు. ఆ విషయం బయటకు రావడంతోనే ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అన్న సంగతి తెలిసిందే. అయితే నిత్యామీనన్‌ను అంతగా ప్రేమించిన నాని ఆమెను కాదని అంజనాని ప్రేమించి వివాహం చేసుకోవడానికి కారణం ఓ డైరెక్టర్ అని.. అతని కారణంగానే నిత్యమీనన్, నానికి మధ్య బ్రేకప్ అయిందని వార్తలు వినిపించాయి. కానీ.. అదంతా ఫేక్.. నిత్యమీనన్,అంజనా మొదటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్.. ఇప్పటికీ వారిద్దరూ చాలా బాగా మాట్లాడుకుంటారు. నిత్యమైనన్‌ను నాని ఎప్పుడు ప్రేమించలేదు.. నాని, నిత్యమీనన్ కూడా మంచి స్నేహితులుగా ఉండేవారు. అలా నిత్యమీనన్ వల్లే నానికి అంజనాకి పరిచయం ఏర్పడిందని.. అంతే తప్పిస్తే వాళ్ల మధ్యనే ఏ బాండింగ్ లేదు కేవలం నాని అంజననే ప్రేమించి వివాహం చేసుకున్నారని టాక్.