పవన్ బ్లాక్ బస్టర్ సినిమాను మొదట ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడా..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలోను.. అటు రాజకీయాల్లోనూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నిన్న‌ మొన్నటి వరకు వరుస సినిమాలో నటిస్తూ ఆడియన్స్‌ను మెప్పించిన పవన్.. ఇటీవల రాజకీయాలలో సక్సెస్ అందుకుని డిప్యూటీ సీఎం పదవిలో కొనసాగుతున్నాడు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్కు ఉన్న క్రేజ్‌ కానీ.. ఫ్యాన్ వేస్ కానీ.. మరొకరికి లేదు అనడంలో సందేహం లేదు. అసలు ఇప్పటికే ఆయన చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తూనే ఉంది. ప‌లు సందర్భాల్లో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి.

Jalsa (2008) - IMDb

అభిమానులు పవర్ స్టార్ సినిమాను ఆ రేంజ్ లో ఆదరిస్తారు. ఒకవేళ సినిమా ఆకట్టుకోకపోయినా.. ఫ్యాన్స్‌ ఒకటికి రెండుసార్లు సినిమాను చూసి కలెక్షన్లు భారీగా వచ్చేలా చేస్తారు. అలా ఇప్పటికే ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెర‌కెక్కించిన ఎన్నో సినిమాలు సూపర్ సక్సెస్ అందుకున్నాయి. అలాంటి క్రమంలో ప్రస్తుతం పవర్ స్టార్ సినిమాలు సెట్స్‌పై ఉన్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లో బిజీగా ఉండడంతో బ్రేక్ ఇచ్చిన పవన్.. తొందరలోనే సెట్స్‌లో పాల్గొని ఆ సినిమాలను పూర్తి చేసి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

అయితే గతంలో పవన్ కళ్యాణ్ చేసిన ఓ సూపర్ హిట్ సినిమాను.. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో వదులుకున్నాడని.. అతను చేయాల్సిన సినిమానే.. పవన్ కు అవకాశం రావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నటించాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ మూవీ మరేదో కాదు జల్సా. జల్సా సినిమాను మొదట మహేష్ బాబు చేయాలని త్రివిక్రమ్ భావించారట. కానీ.. మహేష్ బాబు అప్పుడు వరస సినిమాలతో బిజీగా ఉండడంతో.. సినిమాను రిజెక్ట్ చేశాడు. ఈ క్రమంలో త్రివిక్ర‌మ్ సినిమాను పవన్ కళ్యాణ్‌తో తెర‌కెక్కించి మంచి సక్సెస్ అందుకున్నాడు.