నందమూరి నటసింహం బాలకృష్ణ ముక్కుసూటి మనిషి అన్న సంగతి అందరికీ తెలిసిందే. కోపాన్నైనా, ఫన్నీ యాంగిల్ అయినా డైరెక్ట్ గా చూపించే బాలయ్య.. వేదికలపై పలు సందర్భాల్లో జోకులు వేస్తూ నవ్వించారు. అలాగే తన కోపాని భహిరంగంగా ప్రదర్శించారు. ఇక అన్‌స్టాపబుల్ లాంటి షోలో బాలయ్య కామెడీ టైమింగ్, ఎనర్జీ హైలెట్‌గా నిలిచింది అనడంలో సందేహం లేదు. కాగా అల్లు ఫ్యామిలీకి, బాలకృష్ణకు మధ్య మంచి బాండ్ ఉంది. అఖండ ప్రీ రిలీజ్ ఆవెంట్కు బన్నీ స్పెషల్ గెస్ట్‌గా రాగా.. అల్లు అరవింద్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఆహాలోను బాలయ్య అన్ స్టానబుల్ షో చేశారు.
అంతేకాదు బాలయ్య, అల్లు ఫ్యామిలీ తరచుగా మీట్ అవుతూనే ఉంటారు. ఇలాంటి క్రమంలోనే ఓ ఈవెంట్లో అల్లు హీరో అల్లు శిరీష.. నందమూరి బాలయ్య మధ్య జరిగిన సరదా సంభాషణ నెటింట వైరల్ గా మారుతుంది. అల్లు శిరీష్ బాలయ్య దగ్గరకు వచ్చి.. సార్ సింహ అనే టైటిల్ తో మీ సింహాలు చాలా ఫేమస్ అయిపోయాయి. చాలా హిట్లు కూడా అందుకున్నారు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహ, జైసింహ, వీరసింహారెడ్డి సినిమాలు అదే టైటిల్‌తో వచ్చాయి. అయితే ఈ సినిమాలే కాకుండా మరో సినిమా కూడా సింహ టైటిల్ తో వచ్చింది. అదేంటో మీరు చెప్పండి అని అల్లు శిరీష ప్రశ్నించాడు.
బాలయ్య వెంటనే బొబ్బిలి సింహం ఉంది కదా అన్నారు. ఓకే బొబ్బిలి సింహం కూడా కాదు.. మరో సినిమా ఉంది అని శిరీష్ ప్రశ్నించగా.. ఆ మూవీ గుర్తురాక బాలయ్య తెగ ఆలోచించేసారు. ఇక అల్లు శిరీష్ ఆ ప్రశ్నకు రియాక్ట అవుతూ సింహం నవ్వింది సార్ అంటూ వివరించారు. వెంటనే బాలయ్య అందుకే ఆ సినిమా పోయింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో అక్కడున్న వారంతా ఒకేసారి నవ్వారు. సింహం నవ్వడం ఏంటి.. టైటిల్ కరెక్ట్ కాదు. అందుకే ఆ సినిమా ఫ్లాప్ అయింది అంటూ బాలయ్య వివరించారు. సింహం నవ్వింది సినిమాలో బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ తో కలిసి నటించారు.కాని 1987లో రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచి ప్రేక్షకులను నిరాశ పరిచింది.