టాలీవుడ్ మాన్ ఆఫ్ మైసెస్ ఎన్టీఆర్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో హీరోగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొరటాల శివ డైరెక్షన్లో తారక్ నటిస్తున్న దేవర పై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే ఓవర్సీస్ లో సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగా కొన్నిచోట్ల రికార్డ్ క్రియేట్ చేసింది దేవర. ఈ శుక్రవారం సెప్టెంబర్ 27న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో గ్రాండ్ లెవెల్లో సినిమా రిలీజ్ కానుంది. దీనిలో భాగంగానే టికెట్ బుకింగ్ కర్ణాటకలోని బెంగళూరులో తాజాగా షురూ చేశారు. ఈ క్రమంలో సినిమాపై ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ ఉందో.. క్లియర్గా కనిపిస్తుంది. బెంగళూరు సిటీలో దేవర తెలుగు వెర్షన్ టికెట్లు విపరీతంగా అమ్ముడుపోతున్నాయి.
సెప్టెంబర్ 27న తెల్లవారుజామున 4 గంటల షోకు టికెట్స్ ఓపెన్ చేయగా.. క్షణాల్లోనే ఈ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. బుకింగ్స్ మొదలైన కాసేపటికే మొత్తం టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్ అయ్యాయి. తర్వాత షోలకు బుకింగ్స్ వేగంగా జరిగిపోతున్నాయి. కర్ణాటకలోను దేవర భారీ స్థాయిలోనే రిలీజ్‌కు సిద్ధమైంది. తెలుగు వెర్షన్ తో పాటు కన్నడ వర్షన్ పై కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఇందులో భాగంగానే బెంగళూరులో ఈ సినిమా అంచనలను మించిన ఓపెనింగ్స్ దక్కడం ఖాయమని సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటకలోని దేవాలయాలను సందర్శించుకొని కన్నడ స్టార్ రిషబ్ శెట్టితో కలిసి సందడి చేశారు. కన్నడలోనూ తారక్ ధారాళంగా మాట్లాడి అక్కడ ఆడియన్స్ ని కూడా మెప్పించారు. ఎన్టీఆర్ తల్లీ షాలిని సొంత ఊరు కర్ణాటకలోని కుందాపుర. అందుకే ఎన్టీఆర్ కు కన్నడ పై మంచి పట్టు ఉంది.
దేవర మూవీ కర్ణాటకలోను భారీ కలెక్షన్లు రాబడతాయని నిపుణులు చెప్తున్నారు. ఇక దేవర తర్వాత కన్నడ స్టార్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ మరో సినిమా నటించనున్నారు. ఈ విషయం పక్కన పెడితే.. దేవరా సినిమా టికెట్ల బుకింగ్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎప్పుడు మొదలవుతాయి అంటూ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. టికెట్ ధరల పెంపు, అలాగే అదనపుషోలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పర్మిషన్లు ఇచ్చేసింది. జీవో కూడా జారీ చేసేసింది. దీంతో ఏపీలో సోమవారమే టికెట్లు బుకింగ్స్ మొదలవుతాయని టాక్. తెలంగాణ ప్రభుత్వం నుంచి సోమవారం అనుమతులు వస్తాయని సమాచారం. దీంతో అక్కడ మంగళవారం టికెట్ బుకింగ్ ఓపెన్ అవుతుందట. ఇక దేవర్ నుంచి తాజాగా రెండు ట్రైలర్ కూడా వచ్చేసింది. దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మూవీ పై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఇక మూవీ రిలీజై ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో ఏబచి చూడాలి.