సలార్, మిస్టర్ బచ్చన్ పై ఎస్.వి.కృష్ణారెడ్డి షాకింగ్ రియాక్ష‌న్‌.. హీరోయిన్‌లలో అలాంటివి..

తెలుగులో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్గా కొనసాగిన వారిలో ఎస్‌.వి.కృష్ణారెడ్డి ఒకరు. కామెడీ, ఫ్యామిలీ డ్రామా మిక్స్ చేసి సినిమాలను తెర‌కెక్కించి ఎన్నో సక్సెస్‌లు అందుకున్న ఆయన.. వైవిధ్యమైన స్టైల్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. శుభలగ్నం లాంటి ఆల్ టైం క్లాసికల్ మూవీని తెర‌కెక్కించి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాతో పాటే రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, యమలీల, ఘటోత్కచుడు లాంటి ఎన్నో సినిమాలు తెర‌కెక్కించాడు. మ్యూజిక్ డైరెక్టర్ గాను తన సత్తా చాటుకున్న ఎస్.వి.కృష్ణారెడ్డి.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎస్.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం వస్తున్న సినిమాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

S. V. Krishna Reddy – TOLLYWOOD CREW

డైరెక్టర్ సరికొత్త విధానాలతో సినిమాలు తెర‌కెక్కిస్తుండ‌ట్, గ్లామ‌ర్‌షో లాంటి అంశాల గురించి రియాక్ట్ అయ్యాడు. ప్రస్తుతం ఫ్యామిలీతో వెళ్లి సినిమా చూస్తే ఇబ్బందికర సన్నివేశాలు కూడా ఉంటున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి.. అని యాంకర్ ప్రశ్నించగా.. ఎస్‌.వి. కృష్ణ‌రెడ్డి రియాక్ట్ అవుతూ.. డైరెక్టర్‌గా నా అప్రోచ్ వేరు అంటూ చెప్పుకోచ్చాడు. నా సినిమాల్లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఎక్కడ బూతు డైలాగ్‌ ఉండకూడదు అనేది నా మొదటి నియమం. తర్వాత డబల్ మీనింగ్ డైలాగ్ లు ఉండనివ్వను. చివరకు హీరోయిన్ సరిగ్గా లేకపోయినా.. ఆమె పైట చెంగు జరిగినా కూడా ఒప్పుకోను.. వెంటనే కట్ చెప్పేస్తా. అసిస్టెంట్ ని పంపించి చీర సరి చేసుకోమని చెప్తా.. అని ఎస్.వి.కృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. హీరోయిన్ మాత్రమే కాదు.. నటీమణులు అందరి విషయంలోనూ నా అభిప్రాయం ఇలాగే ఉంటుందని.. అలాగే సినిమాలను తీస్తానంటూ చెప్పుకొచ్చాడు.

Ravi Teja Harish Shankar film gets powerful title Mr Bachchan Telugu News | Mr  Bachchan: అమితాబ్ ఇంటి పేరే రవితేజ సినిమా టైటిల్ - లుక్ చూస్తే బిగ్ బి...

ఈ మధ్యన ఓ సినిమా చాలా బాగుందని చెప్పారు. చూద్దామని వెళ్ళా.. కానీ ఇంటర్వెల్‌కి దండం పెట్టి వచ్చేసా అంటూ చెప్పుకొచ్చాడు. సినిమా పేరు చెప్పడానికి ఆయన ఒప్పుకోలేదు. అలాగే రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ, అలాగే విలన్ పాత్రలు బాగున్నాయి. కానీ.. సినిమా చూడదగ్గ సినిమా కాదు. అందుకే ఈ సినిమాను చూడడం మానేశా అంటూ ఎస్.వి.కృష్ణారెడ్డి వివరించాడు. సినిమా హిట్ అవ్వాలంటే ఒకటే రూల్ ఉంటుంది. సినిమా ప్రారంభమైన ఏడు నిమిషాలలోపు చూస్తున్న ప్రేక్షకులకు సినిమాపై ఇంట్రెస్ట్ రావాలి. అలా ఇంట్రడక్షన్ ఇవ్వగలిగితేనే సినిమా సక్సెస్ అవుతుంది అని వివరించారు. ఇటీవల ప్రభాస్ సలార్ మూవీ వచ్చింది. అది ఆడియన్స్‌ని ఎంగేజ్ చేసే సినిమా. అందులో వెయిట్ ఎంతైనా ఉండొచ్చు. కానీ.. సినిమా మొత్తం ఎంగేజ్ చేస్తూ మూమెంట్ మెయింటెన్ చేసి తెర‌కెక్కించారు. ఇక సలార్.. సక్సెస్‌ఫుల్ సినిమా ఆవడానికి కారణం అదే అంటూ వివరించారు. ప్రస్తుతం ఎస్‌.వి కృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ నెటింట వైరల్ గా మారుతున్నాయి.

సలార్ మొదటి వారం కలెక్షన్స్.. ఏ ఏరియాలో ఎక్కువగా వచ్చాయంటే? | Prabhas Salaar  Movie collections Salaar first-week box office collections are in the range  of 460Cr