సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది అడుగుపెట్టి మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని స్టార్ బ్యూటీలుగా దూసుకుపోతూ ఉంటారు. కేవలం నటించింది ఒక్క సినిమా అయినా.. ఆడియన్స్ మర్చిపోలేని రేంజ్‌లో వారిని ఆకట్టుకుంటారు. మొదటి సినిమాలతోనే సూపర్ సక్సెస్ అందుకుని సినీ క్రిటిక్స్ నుంచి కూడా ప్రశంసలు దక్కించుకుంటారు. అయితే అంతలోనే ఇండస్ట్రీకి దూరమైపోతారు. అలా తనదైన నటనతో ఆడియన్స్ హృదయాల్లో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న బ్యూటీ లేఖ వాషింగ్టన్. ఈ పేరు వింటే ఆమె ఎవరో గుర్తుకురాదు. కానీ వేదం మూవీ హీరోయిన్.. మంచు మనోజ్ లవర్‌గా నటించిందంటే మాత్రం వెంటనే గుర్తుపట్టేస్తారు.
2017 లేఖ వేదం సినిమాలో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క, లేఖ వాషింగ్టన్ ప్రధాన పాత్రలో మెప్పించారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ ఊహించిన సక్సెస్ అందుకోలేదు. కానీ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి నటనకు మంచి గుర్తింపు వచ్చింది. విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. ఇక వారిలో అప్పటికి స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న అనుష్క ఈ సినిమా కోసం పెద్ద రిస్క్ చేసి వేశ్య పాత్రలో నటించింది. ఆర్కా మీడియా వర్క్ బ్యానర్స్ పై రూపొందించిన ఈ సినిమా.. తమిళ్ లోను రీమేక్ చేశారు. ఇక వీరిద్దరితో పటే ఈ సినిమాలో మరో బ్యూటీ దీక్ష సేత్ కూడా నటించి మెప్పించింది. ఇందులో బన్నీ లవర్ గా ఈ అమ్మడు ఆకట్టుకుంది.
మూవీలో మనోజ్ ప్రేయసిగా నటించినా లేక వాషింగ్టన్ నటనకు.. ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే ఈ సినిమా తర్వాత అమ్మడు వేరే సినిమా లో నటించలేదు. పలు సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించినా అమ్మడికి ఊహించిన రేంజ్ లో గుర్తింపు రాలేదు. ఇక చెన్నైలో నాటక కళాకారునిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. 2008లో జయమకొండన్ సినిమాతో తమిళ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత వేదం, వా సినిమాల్లో ఆకట్టుకుంది. ప్రస్తుతం లేక వాషింగ్టన్ అజ్జీ అనే ప్రోడక్ట్ డిజైన్ కంపెనీని రన్ చేస్తూ రాణిస్తుంది. ఇక అతితక్కువ సినిమాలో నటించిన లేఖ.. సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటుంది. ఇలాంటి క్రమంలో అమ్మడి తాజా పిక్స్ నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి. మీరు ఓ లుక్ వేసేయండి.
View this post on Instagram