బిగ్‌బాస్ 8లో డైరెక్టర్ రాఘవేంద్రరావు కూతురు ఉందని తెలుసా.. ఎవ‌రంటే..?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 8 తాజాగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సీజన్ ప్రారంభమై వారం రోజులు గడిచింది. సెప్టెంబర్ ఒకటిన స్టార్ట్ అయిన సీజన్‌కు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించాడు. ఇప్పటికే హౌస్‌లోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చి ఆట రసవాత్రంగా కొనసాగిస్తున్నారు. ఇక నిన్న ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో బెజవాడ బేబ‌క్క ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ వారం నుంచి షో మరింత ఆసక్తిగా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే షోలో ఎన్నో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ షోకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్త‌ వైరల్ గా మారుతుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఓ అమ్మాయి రాఘవేంద్రరావుకి స్వయాన కూతురు అవుతుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

బిగ్‌బాస్‌ నుంచి 'బెజవాడ బేబక్క' ఎంత సంపాదించింది..? | Bigg Boss Telugu 8  1st Evicted Bezawada Bebakka Remuneration | Sakshi

ఇంతకీ ఆ కంటెస్టెంట్ ఎవరూ.. అనుకుంటున్నారా ఆమె ఎవరో కాదు.. తాజాగా ఎలిమినేట్ అయిన బెజవాడ బేబక్కనే అట. ఎస్.. మీరు విన్నది కరెక్టే. బెజవాడ బేబ‌క్క‌కి రాఘవేందర్రావు పెదనాన్న అవుతారని తెలుస్తుంది. అలా వరుసకు రాఘవేంద్రరావుకు బేబ‌క్క కూతురు అవుతుంది. ఇక వీరి మధ్య ఆ బాండ్ ఎలా ఏర్పడింది.. అనుకుంటున్నారా. బేబక్క తల్లి, రాఘవేంద్రరావు భార్య.. ఇద్దరు సొంత అక్క ,చెల్లిళు అట. అలా బేబక్క పెద్దమ్మని రాఘవేంద్రరావు వివాహం చేసుకున్నారు. అయితే ఈ విషయాన్ని స్వయంగా బెజవాడ బేబక్కే వివరించింది. అంతేకాదు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించే నెక్కంటి వంశీ.. ఆమెకు సోదరుడు అవుతాడట.

K. Raghavendra Rao - Wikipedia

పుష్ప, రణరంగం, కలేజా లాంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఆమె అస‌లు పేరు మధు నెక్కంటి. ఇక బేబ‌క్క‌ కూడా ఇప్పటికే.. మీలో ఎవరు కోటీశ్వరుడు, ఏబిసిడి, 24 కిస్సెస్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అలాంటి ఈమె మొదటి వారంలోనే ఎలిమినేట్ అవ్వడం చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. బెజవాడ బేబ‌క్క ఎల్మినేట్‌ అవ్వడానికి కారణం కొద్ది రోజులుగా ఏపిలో కురుస్తున్న వర్షాలు కారణమట. దీని కారణంగా టీవీలు చాలా మంది చూడడం లేదు. అంతేకాదు విజయవాడ మొత్తం వరదల్లో మునిగిపోవడంతో.. అక్కడి వాళ్ళు టీవీలు చూడడమే మానేశారు. అలా బేబక్కకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్.. ఓట్లు సరైన సమయానికి రాకపోవడంతో.. ఆమె ఎలిమినేట్ అయిందని టాక్‌ నడుస్తుంది.