మంచు మోహన్ బాబు నటవారసుడుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణుకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ప్రస్తుతం మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచి విష్ణుకు సైబర్ వేధింపులు తప్పలేదు. సోషల్ మీడియా ద్వారా ఇలాంటి పనికి పాల్పడిన విజయ్ చంద్రమోహన్ దేవరకొండను.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం చంద్రమోహన్ కు నోటీసులు జారీ చేశారు. నేరం నిరూపణకు అవసరమైన ఆధారాలను స్వీకరించిన టీం.. నిందితుడిపై న్యాయస్థానంలో అభియోగ పత్రాలను దాఖలా చేయాలని ఫిక్స్ అయ్యారు.
విజయ్ చంద్రమోసన్ ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. దాంతో పాటే ఎన్నో సోషల్ మీడియా ఖాతాలను ఓపెన్ చేసి పలు రకాల వీడియోలను అప్లోడ్ చేస్తున్నాడు. వీటిలో మంచు విష్ణు ఆయనకు సంబంధించిన నిర్మాణ సంస్థ మా తో పాటు.. సినీ రంగాన్ని కించపరిచి.. అవమానించే అభ్యంతర కరంగా చిత్రీకరించే.. అంశాలను నివేదికలపై పొందుపరిచాడు. ఇతను పదేపదే ఇదే పంథాలు అనుసరించడంతో మా టీం ఇతనిపై సీరియస్ యాక్షన్ తీసుకుంది.
సంస్థ ట్రెజరర్ శివబాలాజీ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు.. ఈ అంశంపై ఫిర్యాదు చేయగా.. కేసు దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ కే మధులత.. సైంటిఫిక్ ఆధారాలతో నిందితుడిని గుర్తించారు. విజయ్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేయగా.. ఆయన నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతనికి నోటీసులు జారీ చేసిన అధికారులు.. కేసు పై మరింత దర్యాప్తు చేస్తున్నారు. త్వరలో అవసరమైతే సరిపడా ఆధారాలను స్వీకరించి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయాలని మా నిర్ణయం తీసుకుంది.