అనారోగ్యంతో రేణు దేశాయ్.. ఆందోళనలో ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..?

ఒకటి టాలీవుడ్ హీరోయిన్ రేణు దేశాయ్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నటించింది ఒకటి, రెండు సినిమాలు అయినా తన నటనతో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఆడియన్స్ లో మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఈ క్రమంలో ఆమె ఆరోగ్య పరిస్థితి బాగోలేదంటూ.. ఆరోగ్యం విష్మించింది అంటూ సోషల్ మీడియాలో న్యూస్ తెగ‌ వైరల్ గా మారుతుంది. తాజాగా ఈ అమ్మ‌డు షేర్ చేసిన పోస్ట్ దీనికి కారణం. తన ఆరోగ్యం బాగోలేదంటూ ఆమె పోస్టులో వెల్లడించింది. ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రేణు దేశాయ్.. యానిమల్ అవ‌ర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. జంతువుల పట్ల ప్రేమగా ఉండే ఈమె.. తాజాగా భారతీయుడు 2లో వీధి కుక్కలపై పెట్టిన అభ్యంతర డైలాగ్ పై స్పందిస్తూ ఈ సినిమా ఫ్లాప్ అయినందుకు చాలా హ్యాపీగా ఉందంటూ రియాక్ట్ అయింది.

అలానే ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉండే రేణు.. ఒకసారిగా ఆరోగ్యం సహకరించడం లేదంటూ చెప్పడం అభిమానుల ఆందోళన కలిగిస్తుంది. నిజానికి ఆరోగ్యం బాగో లేకపోవడం సాధారణంగా సమస్య కాదు. ప్రస్తుతం వైరల్ ఫీవర్లు ఉంటున్న క్రమంలో.. రేణు దేశాయ్ కూడా జ్వరంతో బాధపడే ప్రమాదం ఉంటుంది. కానీ.. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆమెకు చిన్నప్పటి నుంచే చాలా పెద్ద అనారోగ్య సమస్య ఉంది. పుట్టుకతోనే గుండె జబ్బుతో జన్మించిన ఈమె.. ఎప్పటికప్పుడు ఈ సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉంటుంది. ఇక రేణు దేశాయ్ నానమ్మ 47 ఏళ్లకే గుండె జబ్బుతో చనిపోయారు.

అలాగే ఆమె తండ్రి కూడా చాలా చిన్న వయసులోనే ఈ స‌మ‌స్య‌తో మరణించాడు. ఇప్పుడు రేణు దేశాయ్ కూడా గుండె వేగాన్ని బ్యాలెన్స్ చేసేందుకు మెడిసిన్ వాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంది. ఇలాంటి టైంలో తనకు ఆరోగ్యం సహకరించడం లేదంటూ.. రేణు దేశాయ్ పోస్ట్ పెట్టడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఆమెకు అసలు ఏమైంది.. ఇప్పుడు ప‌రిస్థితి ఎలా ఉంది.. అంత ఓకేనా కాదా.. అస‌లేం జ‌రుగుతుంది అంటూ అభిమానులు తమ అంధోళ‌న‌ను సందేహాలుగా వ్యక్తం చేస్తున్నారు.