టాలీవుడ్‌లో జాక్‌పాట్ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే.. ఆ స్టార్ హీరోతో రొమాన్స్..!

మోడ‌లింగ్ రంగంలో రాణించిన ముంబై బ్యూటీ భాగ్యశ్రీ బోర్సేకు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 2023లో యూనియన్ 2తో బాలీవుడ్‌ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది. దీంతో అమ్మడికి కార్తీక్ అర్జున్ నటించిన చందు ఛాంపియన్.. మూవీలో ఛాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలోను అమ్మడు నటనకు ప్రశంసలు వచ్చాయి. ఇక టాలీవుడ్‌లో ర‌వితేజ.. మిస్టర్ బచ్చన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి యూత్‌ను ఆకట్టుకుంది.

ఈ సినిమాకు సక్సెస్ అందకపోయినా.. భాగ్యశ్రీ డ్యాన్స్, ఎక్స్ప్రెషన్స్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే సినిమా డిజాస్టర్ అయినా.. అమ్మడికి టాలీవుడ్ లో మంచి అవకాశాలు దక్కుతున్నాయి. ఇందులొ భాగంగా భాగ్యశ్రీ ఒక క్రేజీ జాక్‌పాట్ ఆఫర్‌ కొట్టేసింది. టాలీవుడ్ స్టార్ హీరోలుగా మంచి ఇమేజ్ సంపాదించుకున్న‌ రానా, దుల్కర్ సల్మాన్ మల్టీ స్టార‌ర్ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే అవకాశాన్ని దక్కించుకుంది. గత కొద్ది రోజులుగా వీరి సినిమాలో భాగ్యశ్రీ నటించబోతుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా ఈ వార్తలను నిజం చేస్తూ మేకర్స్ దీని పై క్లారిటీ ఇచ్చారు.

దుల్కర్ సల్మాన్ హీరోగా.. నీలా ఫేమ్ సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న కాంత సినిమాలో భాగ్యశ్రీ హీరోయిన్గా కనిపించనుంది. దుల్క‌ర్‌తో అమ్మ‌డు రొమ్యాన్స్ చేయ‌నుంది. నిన్న దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్టును అఫీషియల్ గా పోస్ట‌ర్‌తో అనౌన్స్ చేశారు. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమం జరిగింది. ఇందులో భాగ్యశ్రీ పాల్గొన్ని సందడి చేసింది. పూజ కార్యక్రమంకు సంబంధించిన ఫొటోస్ నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి.