స్టార్ నటుడు జయం రవికి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరంలేదు. తెలుగులోను పలు సినిమాలో నటించి మెప్పించిన జయం రవి 2009లో ఆర్తి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే గత కొద్ది నెలలుగా భార్యతో విభేదాలు కారణంగా ఆమెకు దూరంగా ఉంటున్న జయం రవి తాజాగా తనకు విడాకులు ఇచ్చినట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ఇక ఆ విషయాలు ప్రకటంచే నోట్‌లో.. జీవితంలో ఎన్నో అధ్యయనాలు ఉంటాయని.. ప్రతిదానికి దాని సొంత సవాళ్ళు, అవకాశాలు ఉంటాయంటూ రాసుకొచ్చాడు.
నా ప్రయాణాన్ని సినిమాల ద్వారా వెండితెర లోపల ఎల్లప్పుడూ చూస్తున్న వాళ్ళందరికీ.. సినీ పరిశ్రమలో నా మిత్రులు, మీడియా, సోషల్ మీడియా సన్నిహితులకు నా అభిమానులకు చెబుతున్నా.. నేను ఎప్పుడు నిజాయితీగా, పారదర్శకంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నా. నా వ్యక్తిగత జీవితంలో బాధాకరమైన విషయాన్ని.. ఇప్పుడు మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. చాలా ఆలోచన, చర్చల తర్వాత ఆర్తితో నా బంధాన్ని యండ్ చేయాలనే ఒక్క భాధాకర నిర్ణయాన్ని తీసుకున్నా. ఇది తేలికగా తీసుకునే నిర్ణయం కాదు. నాకు దగ్గర వారి ప్రయోజనాలను.. వారి శ్రేయస్సును.. దృష్టిలో ఉంచుకొని ఇలాంటి నిర్ణయం తీసుకున్న.
ఆ ప్రైవసీ నాకు ఇవ్వాలని.. నా దగ్గర వారి ప్రైవసీ కూడా గౌరవించాలని కోరుకుంటున్నా. ఇది నా వ్యక్తిగత నిర్ణయం. దీన్ని అలాగే చూడండి. నా నటన ద్వారా నా అభిమానులు, ప్రజలకు ఆనందం, వినోదం అందించడమే నాకు ప్రధాన లక్ష్యం. మీరు నాకు అందించిన మద్దతుకు నా కృతజ్ఞతలు. ఎల్లప్పుడూ నన్ను ఆదరిస్తారని భావిస్తున్నా అంటూ జయం రవి తన డివోర్స్ నోట్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారడంతో.. సినీ అభిమానులు, కుటుంబ వర్గాలతో పాటు.. అభిమానులు కూడా విషాదంలో ఉన్నారు. తమ నిరాశ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు.